THREE DAY ANNUAL SAKSHATKARA VAIBHAVAM BEGINS IN SRI KALYANA VENKATESWARA SWAMY TEMPLE _ వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభం
Temple Priests of Sri Kalyana Venkateswara Swamy performed “SNAPANA TIRUMANJANAM”(Celestial Bath) to the processional dieties from 10am to 11.30am inside temple premises.
Later in the evening the Processional deities of Lord Kalyana Venkateswara Swamy along with His consorts will be taken out in a procession on Golden Tiruchi around four mada streets.
వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభం
తిరుపతి, జూలై 12, 2013: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. మొదటిరోజు ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు పంచాంగ శ్రవణం చేపట్టారు. ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, పసుపు, చందనం, కొబ్బరినీళ్లు, వివిధ రకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ జరుగనుంది. రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు తిరుచ్చి వాహనంపై స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆర్జిత కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేశారు.
ఈ కార్యక్రమంలో తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎంజి.గోపాల్, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి సి.రెడ్డెమ్మ, ప్రధాన అర్చకుడు శ్రీ పార్థసారధి, సూపరింటెండెంట్లు శ్రీ దినకర్‌రాజు, శ్రీ కృష్ణారావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ రమేష్‌బాబు, ఇతర అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.