Three Day PAVITHROTSAVAM in Sri Kalyana Venkateswara Swamy Temple_ నవంబర్‌ 2 నుండి 4వ తేది వరకు శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు 

Tirupati, 29 October 2010: The Annual pavithrotsavams will be conducted in the temple of Lord Sri Kalyana Venkateswara Swamy, Srinivasa Mangapuram for 3 days from November 2nd to 4th, 2010. In view of these Utsavams in the temple, all arjitha sevas are cancelled during these days.

However, the devotees who intend to participate in Pavithrotsavams may avail this opportunity by paying Rs.500/- per ticket and two persons will be allowed. Special programmes such as Ankurarpanam on November 1st, Pavithra Prathishta on November 2nd, Pavithra samarpana on November 3rd and Poornahuti on November 4th

Issued by the Public Relations Officer, TTD.

నవంబర్‌ 2 నుండి 4వ తేది వరకు శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

 తిరుపతి, 2010 అక్టోబర్‌ 29: శ్రీనివాస మంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నవంబర్‌ 2 నుండి 4వ తేది వరకు వార్షిక పవిత్రోత్సవాలు వేడుకగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఆలయంలో నవంబర్‌ 1వ తేదిన అంకురార్పణ, 2వ తేదిన పవిత్ర ప్రతిష్ఠ, 3వ తేదిన పవిత్ర సమర్పణ, 4వ తేదిన పూర్ణాహుతి నిర్వహిస్తారు.

ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జితసేవలు రద్దుచేశారు. అయితే పవిత్రోత్సవాల్లో పాల్గొన దలచిన భక్తులు ఒక టిక్కెట్టుకుగాను రూ.500/-లు చెల్లించాల్సి ఉంటుంది. ఒక టిక్కెట్టుకు ఇద్దరిని అనుమతిస్తారు.

సంక్షిప్త సమాచారంః-

పరమాత్ముని శాస్త్రోక్తముగా అర్చించుట బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యము కాని పని. ఆజ్ఞానులమైన, అశక్తులమైన, అల్పజ్ఞులమైన మనచే చేయబడు అర్చన మంత్రహీనం,  ద్రవ్యహీనం, భక్తిహీనం, శ్రద్ధాహీనం, క్రియాహీనం అవుతుంది.

ఆగమోక్తంగా జరుపు నిత్య – వార – మాస – పక్ష – నక్షత్ర – సంవత్సరములందు జరుగు అర్చన, స్నపన, ఉత్సవ, విశేష పూజాదులలో తెలిసీ తెలియని దోషాలు సంభవిస్తే అది సంపూర్ణ ఫలితము నివ్వదు.

శ్రీమన్నారాయణునకు చేయు అర్చనాదోషములతో పాటు, అన్ని దోషములు నివారింపచేయునది, సర్వాభీష్టములను, అందించునది, యజ్ఞఫలమును ప్రసాదించునది, మన ఆత్మశరీరం ఇంద్రియములు వాక్కు, కర్మలను పవిత్రములుగా చేయునది పవిత్రోత్సవము.

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి ఈ పవిత్రోత్సవసేవ అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ అశ్వయుజ బహుళ ద్వాదశి పవిత్ర సమర్పణగా జరుగు ఈ ఉత్సవంలో అంకురార్పణం, అగ్నిప్రతిష్ఠ, నవకలశ స్థాపన, పవిత్ర ప్రతిష్ట, విశేష హోమం, పవిత్ర సమర్పణ, వీధి ఉత్సవం, పూర్ణాహుతి, ప్రార్థన అను వైదిక కార్యక్రమములతో వైఖానసభగవచ్ఛాస్త్ర రీత్యా 2010 నవంబరు 2,3,4తేదీలందు పవిత్రోత్సవము జరుపబడును.
      
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.