తుమ్మూరులోని శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు
తిరుపతి, 2019 సెప్టెంబరు 29: టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, నాయుడుపేట మండలం, తుమ్మూరు గ్రామంలోని శ్రీ కరియమాణిక్యస్వామి, శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం అంకురార్పణ, కలశస్థాపన నిర్వహించారు. సాయంత్రం శ్రీ పార్వతిదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు.
అదేవిధంగా, సెప్టెంబరు 30న శ్రీ బాలా త్రిపురసుందరి, అక్టోబరు 1న శ్రీ లలితా త్రిపురసుందరి, అక్టోబరు 2న శ్రీమహాలక్ష్మి, అక్టోబరు 3న శ్రీ అన్నపూర్ణా దేవి, అక్టోబరు 4న శ్రీ గాయత్రిదేవి, అక్టోబరు 5న శ్రీ సరస్వతిదేవి, అక్టోబరు 6న శ్రీ దుర్గాదేవి, అక్టోబరు 7న శ్రీ మహిషాసురమర్ధిని, అక్టోబరు 8న శ్రీ రాజరాజేశ్వరి అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తారు.