శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2019 సెప్టెంబరు 29: టిటిడికి అనుబంధంగా ఉన్న చంద్రగిరి మండలం శేషాపురం గ్రామంలోని శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
ఇందులో భాగంగా సెప్టెంబరు 29న శ్రీ ఉమామహేశ్వరి దేవి, సెప్టెంబరు 30న శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి, అక్టోబరు 1న శ్రీ గాయత్రిదేవి, అక్టోబరు 2న శ్రీ అన్నపూర్ణాదేవి, అక్టోబరు 3న శ్రీ లలితాదేవి, అక్టోబరు 4న శ్రీ సరస్వతి దేవి, అక్టోబరు 5న శ్రీ మహాలక్ష్మీదేవి, అక్టోబరు 6న శ్రీ దుర్గాదేవి, అక్టోబరు 7న మహిషాసురమర్థిని, అక్టోబరు 8న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. చివరిరోజు దుర్గా హోమం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దేవి భాగవతంపై పురాణ ప్రవచనం, లలితసహస్రనామ పారాయణం కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.