TIRUCHANOOR KARTHIKA BRAHMOTSAVAMS TO GET TIRUMALA-STYLE ILLUMINATION _ తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలకు తిరుమల తరహాలో విద్యుత్ అలంకరణలు

ARRANGEMENTS TO PROVIDE A SPIRITUAL EXPERIENCE TO DEVOTEES: TTD JEO DR. A . SHARATH

Tirupati, September 28, 2026: TTD JEO Dr. A. Sharath has directed the Engineering officials to provide attractive Tirumala-style electrical illuminations for the Karthika Brahmotsavams of Tiruchanoor Sri Padmavathi Ammavari Temple.

The Brahmotsavams will be held from December 5 to 14. On Monday, the JEO inspected the arrangements along with officials and issued several instructions.

Attractive Illuminations

Dr. Sharath directed officials to make the illuminations more grand and attractive than last year. Tiruchanoor and major junctions in Tirupati should be illuminated to reflect the grandeur of the Brahmotsavams and create a spiritual atmosphere for devotees.

Focus on Devotee Facilities

The JEO reviewed the ongoing development works and instructed officials to complete them within the stipulated time. He directed them to make advance arrangements for the smooth movement of devotees.

Special arrangements, including strong queue lines and barricades, should be made for the Gaja Vahanam and Panchami Theertham days, when large numbers of devotees are expected.

Coordinated Arrangements by All Departments

Dr. Sharath instructed all departments to work in close coordination to ensure comfortable darshan and a spiritually enriching experience for devotees during the Brahmotsavams.

He also inspected the garden, entry and exit routes, Vahana Mandapam, four Mada Streets and Gate Nos. 1, 2 and 3, and issued necessary instructions.

TTD Deputy EO Sri Harindranath, VGO Sri Girdhar, AVSO Sri Srihari Rao, DE Sri Ravishankar Reddy, Additional Health Officer Dr. Sunil Kumar, temple priest Sri Babu Swamy and other officials participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలకు తిరుమల తరహాలో విద్యుత్ అలంకరణలు

భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ఏర్పాట్లు : టీటీడీ జేఈవో డా. ఎ. శరత్

తిరుపతి, సెప్టెంబర్ 28, 2026: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తరహాలో ఆకట్టుకునే విద్యుత్ అలంకరణలు చేపట్టాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

డిసెంబర్ 5 నుంచి 14వ తేదీ వరకు జరుగనున్న అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సోమవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు.

భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలు

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, గతేడాది కంటే ఈ ఏడాది మరింత కాంతివంతంగా, సుందరంగా విద్యుత్ అలంకరణలు చేపట్టాలని సూచించారు. తిరుచానూరు పరిసర ప్రాంతాలతో పాటు తిరుపతిలోని ప్రధాన కూడళ్లను విద్యుత్ వెలుగులతో అలంకరించి, అమ్మవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి

బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని జరుగుతున్న అభివృద్ధి పనులను జేఈవో పరిశీలించి, పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

ప్రత్యేకంగా గజవాహనం, పంచమి తీర్థం రోజుల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా పటిష్టమైన క్యూ లైన్లు, బ్యారికేడ్లు తదితర ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.

శాఖల సమన్వయంతో భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, ఆధ్యాత్మిక ఆనందం కలిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని జేఈవో సూచించారు.

అనంతరం అధికారులతో కలిసి ఉద్యానవనం, ప్రవేశం, నిష్క్రమణ మార్గాలను, వాహన మండపం, నాలుగు మాడ వీధులు, గేట్ నెంబర్ 1, 2,3 ప్రాంతాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. 

ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, వీజీవో శ్రీ గిరిధర, ఏవీఎస్వో శ్రీ శ్రీహరి రావు, డీఈ శ్రీ రవిశంకర్ రెడ్డి, అదనపు హెల్త్ ఆఫీసర్ డా సునీల్ కుమార్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి తదితర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది