TIRUCHANOOR PAC TO HAVE A MINI MUSEUM _ వేసవి రద్దీ నేపద్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 4 February 2019: The new Pilgrim Amenities Complex (PAC) which is set ready at Tiruchanoor will have a mini museum to showcase the grandeur of Tirumala, Tirupati and Tiruchanoor soon.

During the senior officers meeting held at TTD Administrative Building in Tirupati, the EO Sri Anil Kumar Singhal said, the Tirumala museum should be developed in a phased manner while the one Tirupati should be revived as a historical structure, he instructed the concern. He also said, one mini museum shall also be planned at the upcoming Sri Padmavathi PAC in Tiruchanoor.

As the summer holidays will be approaching in couple of months, the EO instructed the concerned officers to make arrangements to ensure that there is no scarcity of water, shortage of laddus etc. for the pilgrims. He directed that a separate special cell need to be set up in Vaikuntham Queue Compelx with all the departments to feed relevant information viz.releasing time of compartments, menu of annaprasadams, about laddu prasadams etc. in the LED display screens for better understanding of the pilgrims, he maintained.

Akin to Chittoor District, where all TTD Kalyana Mandapams are made online, the same system need to be developed to others also located across the country, he instructed. He directed all the senior officers who are also allotted one local temple to see overall development, should visit their respective temples regularly and prepare an action plan on their observations, he added.

JEOs Sri K S Sreenivasa Raju, Sri P Bhaskar, CVSO Sri Gopinath Jetti, CE Sri Chandra Sekhar Reddy, FACAO Sri Balaji were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

వేసవి రద్దీ నేపద్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి,2019 ఫిబ్రవరి 04: తిరుమల శ్రీవారి దర్శనార్థం వేసవిలో విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు నీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం ఉదయం సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రాబోవు వేసవిలో తిరుమలలోని అన్ని ప్రాంతాలలో భక్తులకు అవసరమైన నీటి సరఫరాచేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని టిటిడి ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. సర్వదర్శనం క్యూలైన్లలో ప్రవేశ మార్గాలలో వారికి శ్రీవారి దర్శన సమయాన్ని తేలుసుకునేందుకు వీలుగా డిస్‌ప్లే బోర్డులు, ఎప్పటికప్పుడు ప్రకటనల ద్వారా తెలియజేయాలన్నారు. తిరుమలలోని క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని భక్తులకు వారికి దర్శన సమయం, అన్నప్రసాదాలు పంపిణి, లడ్డూ ప్రసాదాలు తదితర సమాచారాన్ని అందించేలా అన్ని విభాగాల సిబ్బందితో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్ద ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తద్వారా భక్తులు క్యూలైన్‌ ఆరంభంలోనే తమకు ఎన్ని గంటలలోపు దర్శనం అవుతుందో ముందస్తుగానే తెలిసే అవకాశం ఉంటుదన్నారు.

తిరుమలలోని ఎస్‌వి మ్యూజియంను దశల వారిగా అభివృద్ధిచేయాలన్నారు. అదేవిధంగా తిరుపతిలోని మ్యూజియంను చారిత్రక సంపదగా తీర్చిదిద్ధాలని, తిరుచానూరు వద్ద నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పద్మావతి వసతి సమూదాయంలో భక్తులను ఆకట్టుకునేలా చిన్నపాటి మ్యూజియం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో టిటిడి కల్యాణమండపాలను భక్తులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సౌలభ్యం కల్పించామని, అదేతరహలో ఇతర ప్రాంతాలలోని కల్యాణ మండపాలను బుక్‌ చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ రూపొందించాలన్నారు. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ధర్మ ప్రచార మండలి, భజన మండలి సభ్యులు తమ పేర్లు, కార్యక్రమాలను నమోదు చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ రూపొందించాలన్నారు.

టిటిడి స్థానిక ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక అధికారులుగా నియమించిన టిటిడి సీనియర్‌ అధికారులు తరచు సంబంధిత ఆలయాలను సందర్శించి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు మెరుగుపడేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. టిటిడి స్థానిక ఆలయాలలో సిసిటివిలు ఏర్పాటు చేసి, భద్రత మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. భక్తులు వేసవిలో ఎండకు, వర్షానికి ఇబ్బందిలేకుండా అలిపిరి, శ్రీవారి మెట్టు నడకదారిలో, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వెలుపల ఉన్న మార్గాలలో షెల్టర్‌లను సౌకర్యవంతంగా ఏర్పాటు చేయాలన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు పంపీణి జరుగుతున్న ప్రాంతంలో భక్తులకు ఇబ్బంది లేకుండా సివిల్‌ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్వో శ్రీ గోపినాధ్‌ జెట్టి, సిఇ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఎ అండ్‌ సిఎవో శ్రీ బాలాజి, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.