TIRUCHANOOR SHINES LED LIGHT SETTINGS_ విద్యుత్‌ కాంతుల్లో పద్మావతి శ్రీనివాసుల వైభవం

Tiruchanur, 20 November 2017: The pilgrim centre of has assumed a new look in the brightness of LED lights which were erected all through the panchayat for the annual festival.

The temple management of TTD has givem priority to LED light displays whuch are both economic and more bright than normal serial lights.

The Srinivasa Kalyanam, Kamadhenu, Ast Lakshmi, Sita Rama Kalyanam, Suryanarayana Murthy etc. are standing as special attraction. The elextrical wing of TTD has set up 72 LED structures and 10 arches including sapthadwarams under the supervision of SE Electrical Sri Venkateswarulu.

About 40 workers strived for two and a half months to make these structures under the instructions of 16 engineers.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూెత్సవాల ప్రత్యేకవ్యాసం -7

విద్యుత్‌ కాంతుల్లో పద్మావతి శ్రీనివాసుల వైభవం

తిరుపతి, 2017 నవంబరు 20: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మూెత్సవాలకు విద్యుత్‌ దీపాల అలంకరణలు మరింత శోభను చేకూరుస్తున్నాయి. అమ్మవారి ఆలయం, వాహనమండపం, ఆస్థానమండపం, మాడ వీధులు, తిరుపతిలోని రామానుజ సర్కిల్‌ నుంచి తిరుచానూరు ఆలయం వరకు రోడ్డు పొడవునా ఆకట్టుకునేలా విద్యుత్‌ అలంకరణలు చేపట్టారు. రాత్రి వేళ ఈ మార్గంలో వెళుతున్న భక్తులకు ఉత్సవ శోభ ఉట్టిపడుతోంది. మొత్తం 72 అలంకరణలు, 10 విద్యుత్‌ ఆర్చిలు ఏర్పాటుచేశారు.

కనువిందు చేస్తున్న పెద్ద కటౌట్లు :

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ సమీపంలో పంచాయతీ కార్యాలయం వద్ద 65 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన అతిపెద్ద గోమాత నిలువెత్తు విద్యుత్‌ కటౌట్‌ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో పలువురు దేవతామూర్తుల చిత్రాలను పొందుపరిచారు. పద్మపుష్కరిణికి పడమర వైపు 40×70 సైజులో సూర్యనారాయణస్వామి, ఉత్తరంవైపు 45×65 సైజులో విశ్వరూపం, ఆస్థానమండపం ముందు వైపు అష్టలక్ష్ములు, వెనుకవైపు లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి నిలువెత్తు కటౌట్లు భక్తిభావాన్ని పంచుతున్నాయి.

ఆలయానికి ప్రత్యేక అలంకరణ :

ఆలయ గోపురాన్ని ఎల్‌ఇడి దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ లోపల, బయటవైపు, ప్రాకారాలు, ఆస్థానమండపాన్ని రంగులు మారే విద్యుత్‌దీపాలతో అలంకరణ చేపట్టారు. పుష్కరిణిలోని నీరాళి మండపం, తోళప్పగార్డెన్‌ అతిథిగృహంతోపాటు నాలుగు మాడ వీధుల్లో ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారాలకు అనుగుణంగా ఫ్లడ్‌లైట్లతో అలంకరణ చేశారు. శుక్రవారపుతోటలో పుష్ప ప్రదర్శన, ఇతర ఎగ్జిబిషన్ల వద్ద విద్యుత్‌ అలంకరణ చేపట్టారు.

కాగా, ఆలయం ఎదురుగా వరదహస్తం, గడపలక్ష్మి, సమాజం వీధిలో గోపాలకృష్ణుడు, సన్నిధి వీధిలో వేంకటేశ్వరస్వామి, డెప్యూటీ ఈవో కార్యాలయం వెనుక వైపు కలశలక్ష్మీ, జనరేటర్‌ గది వద్ద శ్రీరామ పట్టాభిషేకం, పుష్కరిణి లోపలి వైపు అష్టలక్ష్ములు, బయటివైపు దశావతారాలు ఏర్పాటుచేశారు.

ఆకట్టుకుంటున్న సప్తద్వారాలు :

తిరుపతిలోని శ్రీ రామానుజ సర్కిల్‌ నుంచి తిరుచానూరు వరకు వివిధ రకాల విద్యుత్‌ తోరణాలు ఏర్పాటుచేశారు. ఇందులో సప్తద్వారాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రోడ్డుకు ఇరువైపులా దశావతారాల్లోని చిత్రాలు, లక్ష్మీ, శ్రీరామమూర్తి, ఆంజనేయస్వామి, వినాయకుడు లాంటి పలువురు దేవతామూర్తుల చిత్రాలు, రోడ్డు డివైడర్లలో ప్రత్యేక లైటింగ్‌ ఏర్పాట్లు చేశారు.

ఈ విద్యుత్‌ అలంకరణకు గాను 16 మంది టిటిడి ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణలో 40 మంది సిబ్బంది రెండున్నర నెలల పాటు పనిచేశారు. ఈసారి బ్రహ్మూెత్సవాల్లో విద్యుత్‌ వాడకాన్ని తగ్గించేందుకు పూర్తిగా ఎల్‌ఇడి విద్యుత్‌ దీపాలను ఏర్పాటుచేశారు. విద్యుత్‌ అలంకరణ పనులను టిటిడి ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో డిఇ శ్రీ చంద్రశేఖర్‌, డెప్యూటీ ఇఇ శ్రీ శంకర్‌, ఏఈ శ్రీ గోపినాథ్‌ పర్యవేక్షించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.