ANKURARPANAM PERFORMED IN SURYA NARAYANA SWAMY TEMPLE_ తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయ అష్టబంధన మహాసంప్రోక్షణకు అంకురార్పణ

Tiruchanoor, 1 May 2018: Ankurarpanam to Astabandhana Mahasamprokshana in Surya Narayana Swamy temple at Tiruchanoor was performed on Tuesday evening.

On Wednesday there will be Kalasa Sthapana to other series of rituals which will be observed till Maha Samprokshanam on May 6.

Special Grade DyEO Sri Munirathnam Reddy is supervising the arrangements.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయ అష్టబంధన మహాసంప్రోక్షణకు అంకురార్పణ

మే 01, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమానికి మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆలయం వద్దగల గంగుండ్ర మండపంలో మే 2 నుండి 6వ తేదీ వరకు అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఇందులో భాగంగా ఉదయం 9 నుండి 10 గంటల వరకు ఆచార్య ఋత్విక్‌వరణం జరిగింది. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు శుక్రవారపుతోటలో మేదినీపూజ, శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు.

మే 2న అకల్మషప్రాయశ్చిత్తహోమం, కలశస్థాపన, మే 3న అష్టబంధన పూజ, అష్టబంధన హోమం, 4న అష్టబంధనం, అధివాసత్రయం, సర్వదైవత్యహోమం, మే 5న మహాశాంతిజప్యం, మహాశాంతి అభిషేకం, మే 6న ఉదయం మహాపూర్ణాహుతి, ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకు మహాసంప్రోక్షణ, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు అశ్వవాహన సేవ జరుగనున్నాయి.

ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమునిరత్నంరెడ్డి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.