SSD COUNTERS FOR THE CONVENIENCE OF PILGRIMS_ సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను పరిశీలించిన జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 1 May 2018: The Slotted Sarva Darshan (SSD) counters are being set up by TTD only for the convenience of the pilgrims, said Tirupati JEO Sri P Bhaskar.

After whirlwind inspection of SSD counters in Tirupati on Tuesday evening speaking on this occasion JEO said, to minimise waiting hours to pilgrims, TTD has mulled this Sarva Darshan with specific time slots. In Tirupati we have set up 22 in Vishnu nivasam, 5 at Srinivasam, 10 in RTC bus stand and 12 in Railway station, 8 in II and III chowltries have been set up which will be opened shortly. If the pilgrims ample time for Tirumala darshan, they can visit Srinivasa Mangapuram, Appalayagunta and Tiruchanoor also”, he added.

He also instructed the PRO to give wide publicity on SSD counters.

Addl CVSO Sri Sivakumar Reddy, SE Sri Ramesh Reddy, GM Sri Sesha Reddy, Chief Information Officer Sri Sudhakar, DyEO Smt Kasturi, TCS Sri Satya and others were present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను పరిశీలించిన జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2018 మే 1: నిర్దేశించిన సమయంలో శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా తిరుపతిలోని టిటిడి విష్ణునివాసం వసతి సముదాయంలో ఏర్పాటు చేసిన సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను మంగళవారం సాయంత్రం అధికారులతో కలసి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ సర్వదర్శనం భక్తులు నిర్దేశించిన సమయంలో శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ సూచనల మేరకు తిరుపతిలో విష్ణునివాసంలో 22 కౌంటర్లు, శ్రీనివాసంలో 5, భూదేవి కాంప్లెక్స్‌లో 10, ఆర్టీసీ బస్టాండ్‌లో 12, రైల్వేస్టేషన్‌ వెనుకవైపుగల రెండు, మూడు సత్రాలలో 8 కౌంటర్లు ఏర్పాటు చేశామని, ఆయా కేంద్రాలలో భక్తులు టోకెన్లు పొందాలని కోరారు. ఆయా ప్రాంతాలలో వృద్ధులు, వికలాంగుల సౌకర్యార్థం ఒక్కో కౌంటర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. ఈ విధానాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టోకెన్లు పొందిన భక్తులు సమయం ఉన్న పక్షంలో తిరుపతిలోని ఆలయాలతోపాటు శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు, అప్పలాయగుంట ఆలయాలను దర్శించుకోవచ్చని సూచించారు.

అంతకుముందు విష్ణునివాసంలో టిటిడి అధికారులతో జెఈవో సమీక్ష నిర్వహించారు. సర్వదర్శనం భక్తుల కోసం ఏర్పాటు చేసిన సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లపై విస్తృతంగా ప్రచారం చేయాలని పిఆర్వోను ఆదేశించారు.

జెఈవో వెంట టిటిడి ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌ రెడ్డి, ఎస్‌ఈ-1 శ్రీ రమేష్‌రెడ్డి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, చీఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌ శ్రీ సుధాకర్‌, డిప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఎవిఎస్‌వో శ్రీ పార్థసారధిరెడ్డి, టిసిఎస్‌ అధికారి శ్రీ సత్య, ఇతర అధికారులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.