MAHASAMPROKSHANAM IN SRI SRINIVASA TEMPLE AT SRI PAT FROM APRIL 22 TO 27_ ఏప్రిల్ 22 నుండి 27వ తేదీ వరకు తిరుచానూరులోని శ్రీ శ్రీనివాస ఆలయం మహాసంప్రోక్షణ
Tirupati, 13 April 2018: Maha Samprokshana in Sri Srinivasa temple at Tiruchanoor will be observed from April 22 to 27.
The religious fete commences with Ankurarpanam between 6pm and 8pm on Sunday.
The religious fete includes, Chatustharchana on April 23, Jaladhivasam and Ksheeradhivasam on April 24, Sayanadhivasam on April 25, Karmanga Snapanam and Panchasayyadhivasam on April 26 and Maha Samprokshanam on April 27.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI
ఏప్రిల్ 22 నుండి 27వ తేదీ వరకు తిరుచానూరులోని శ్రీ శ్రీనివాస ఆలయం మహాసంప్రోక్షణ
తిరుపతి, 2018 ఏప్రిల్ 13: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ శ్రీనివాస ఆలయంలో ఏప్రిల్ 22 నుండి 27వ తేదీ వరకు పున: ప్రతిష్ట, మహాసంప్రోక్షణ శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏప్రిల్ 22వ తేదీ ఆదివారం సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు అంకురార్పణం జరుగనుంది.
ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 1.00 గటల వరకు చతుష్ఠానార్చన, సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు నిత్యహోమం, నూతన విగ్రహలకు దాన్యాధివాసం, ఏప్రిల్ 24వ తేదీ ఉదయం జలాధివాసం, సాయంత్రం క్షీరాధివాసం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రం శయ్యాధివాసం, ఏప్రిల్ 26వ తేదీ సాయంత్రం కర్మాంగ స్నపనం, పంచశయ్యాదివాసం జరుగనుంది. ఏప్రిల్ 27వ తేదీ ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు పున: ప్రతిష్ట, మహాసంప్రోక్షణ అత్యంత వైభవంగా నిర్వహించి, అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.