TTD TO OBSERVE TYAGARAJA ARADHANOTSAVAM ON APRIL 21_ ఏప్రిల్‌ 21న తిరుమలలో శ్రీత్యాగరాజస్వామి జయంతి

Tirumala, 13 April 2018: The 251st Jayanthi of Saint Tyagaraja Swamy will be observed on April 21 in Kalyana Vedika located at Papavinasanam Road in Tirumala between 6pm and 8pm.

Every year TTD observes this fete in a big way on par with Tiruvayur Tyagaraja Aradhanotsavams. Nearly 400 carnatic music experts from Southern states takes part in the musical fiesta presenting the sankeertans of “Carnataka Sangeetha Pitamaha” including Tyagaraja Pancharatnalu.

This fete will be jointly organised by SV College of Music and Dance and HDPP wings of TTD.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

ఏప్రిల్‌ 21న తిరుమలలో శ్రీత్యాగరాజస్వామి జయంతి

తిరుమల, 2018 ఏప్రిల్‌ 13: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తెలుగు వాగ్గేయకార చక్రవర్తి శ్రీత్యాగరాజస్వామివారి 251వ జయంతి మహోత్సవాన్ని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 21వ తేదీ శనివారం తిరుమలలో ఘనంగా నిర్వహించనున్నారు.

తిరుమలలోని పాపవినాశనం రోడ్డులో గల కల్యాణ వేదికలో సాయంత్రం 6.00 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ధర్మప్రచారంలో భాగంగా ప్రముఖ వాగ్గేయకారుల జయంతి, వర్ధంతి మహోత్సవాలను టిటిడి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ కార్యక్రమంలో దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన దాదాపు 400 మంది కళాకారులు పాల్గొని శ్రీ త్యాగరాజస్వామివారి పంచరత్న కృతులు, ఉత్సవ సంప్రదాయ కీర్తనలు, దివ్యనామ సంకీర్తనలను ఆలపిస్తారు. టిటిడి అస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రముఖ సంగీత విద్వాంసులు, ఎస్వీ సంగీత కళాశాల అద్యాపకులు, విద్యార్థులు, స్థానిక, స్థానికేతర కళాకారులు పాల్గొంటారు. శ్రీ త్యాగరాజస్వామివారు 1767వ సంవత్సరంలో జన్మించారు. వీరి వంశీయులు ప్రకాశం జిల్లా కాకర్ల గ్రామానికి చెందినవారు. యుక్త వయసులో త్యాగయ్య భక్తి, జ్ఞాన, వైరాగ్యాలకు సంతోషించిన నారద మహర్షి స్వయంగా స్వరార్ణవం అనే సంగీత గ్రంథాన్ని ఇచ్చి ఆశీర్వదించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. సంగీత జగద్గురువుగా వినుతికెక్కిన త్యాగయ్య దాదాపు 180 సంవత్సరాల క్రితం తిరువైయ్యారు. నుంచి తిరుమల క్షేత్రానికి విచ్చేసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈయన భారత, భాగవత, రామాయణ కావ్య సారాంశాలను ఔపోసన పట్టి తన మధుర సంగీత, సాహిత్య రసాభావంతో తత్త్వ, భక్తి, వేదాంత, దార్శనిక, శాంతి విషయాలను సమగ్రంగా తన కృతుల ద్వారా లోకానికి తెలియజేశారు. అందుకే త్యాగయ్య కృతులను ”త్యాగ బ్రహ్మోపనిషత్తులు” అంటారు. ఈయన 1847వ సంవత్సరంలో పరమపదించారు. ఇంతటి గొప్ప చరిత్ర గల త్యాగయ్య వర్ధంతి ఆరాధనోత్సవాలను తిరువయ్యారులో ప్రతి ఏటా పుష్యబహుళ పంచమినాడు వైభవంగా నిర్వహిస్తారు. ఇదే తరహాలో త్యాగయ్య జయంతి ఉత్సవాలను టిటిడి ఘనంగా నిర్వహిస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.