TIRUMALA GEARED UP FOR ANIVARA ASTHANAM_ శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానానికి సర్వం సిద్ధం

Tirumala, 15 July 2018: The hill shrine of Lord Venkateswara geared up to observed annual budget festival, Anivara Asthanam on Tuesday.

The traditional temple court will be observed at Bangaru Vakili inside sanctum between 7am and 9am.

As the fete will be followed by Pushpa Pallaki seva in the evening, the arrangements were on place to decorate the massive floral theme carrier.

The thematic decorations will commence on Monday evening at Vahana Mandapam while the flower decorations will be done on Tuesday morning. This year the garden wing has planned Pandaripur Pandu Ranga Vitthala as Pallaki theme.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానానికి సర్వం సిద్ధం

జూలై 15, తిరుమల 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీ మంగళవారం జరుగనున్న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినానికి సర్వం సిద్ధమైంది.

ఆలయంలోని బంగారు వాకిలి వద్ద ఉదయం 7 నుండి 9 గంటల మధ్య ఈ సంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ తరువాత సాయంత్రం 6 గంటలకు పుష్పపల్లకీ ఊరేగింపు జరుగనుంది. ఇందుకోసం ఆదివారం పల్లకీని సిద్ధం చేశారు. సోమవారం సాయంత్రానికి వాహన మండపం వద్ద వివిధ దేవతామూర్తుల సెట్టింగులను సిద్ధం చేయనున్నారు. మంగళవారం ఉదయానికి పుష్పాలంకరణలు పూర్తి చేస్తారు. ఈసారి పండరీపురం పాండురంగ విఠలుని రూపంలో పుష్పపల్లకీని అలంకరించేందుకు టిటిడి ఉద్యానవన విభాగం సమాయత్తమైంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.