SANKEERTANS, SATSANG MARKS SECOND DAY METLOTSAVAM_ జూలై 16న మెట్లపూజ

Tirupati, 15 July 2018: On the second day of three day Traimasika Metlotsavam held by Dasa Sahitya Project of TTD on Sunday, the day lasted with hectic schedule of Dasa Sankeertans and Satsangs by Bhajanaparas.

While on Monday morning during wee hours, Metlotsavam will be observed at Alipiri footpath route.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూలై 16న మెట్లపూజ

తిరుపతి, 2018 జూలై 15: టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనుక గల శ్రీగోవిందరాజస్వామి మూడో సత్ర ప్రాంగణంలో జరుగుతున్న త్రైమాసిక మెట్లోత్సవం ఆదివారం రెండో రోజుకు చేరుకుంది. జూలై 16న సోమవారం ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు.

ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు చెందిన భజన మండళ్ల సభ్యులు ఆదివారం ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించారు. ధార్మిక సందేశం అనంతరం కొత్త సంకీర్తనలు నేర్చుకున్నారు. సాయంత్రం మానవాళికి హరిదాసులు అందించిన ఉపదేశాలను వినిపించారు. ఆ తరువాత సంగీత విభావరి జరిగింది.

ఈ కార్యక్రమంలో టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీపి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.