TIRUMALA GEARING UP FOR V-DAY SPECIAL RELIGIOUS EVENTS _ తిరుమల శ్రీవారి ఆలయంలో జ‌న‌వ‌రి 6న వైకుంఠ ఏకాద‌శి, 7న వైకుంఠ ద్వాద‌శి

Tirumala, 23 Dec. 19: A spate of special religious programs are lined up in Srivari Temple at Tirumala as a part of Vaikunta Ekadasi on January 6 and Vaikuntha Dwadasi on January 7.

On January 6 Tiruppavai Parayanam will be held in the Srivari temple from 12.30 midnight to 2.30am ahead of other Dhanurmasam rituals like Tomala, Koluvu, Panchanga Sravanam before commencement of Vaikunthadwara darshanam for devotees.

Between 9am and 11am, there will be procession of Swarnaratham along the four-mada streets with Malayappaswamy and His consorts taking ride on it.

Similarly Sahasra Deepalankaraseva will be performed between 5pm and 7pm in the evening as a cynosure to all devotees. At 8.30pm Adhyayanotsavam will be conducted at the Ranganayakula mandapam.

CHAKRSNANAM ON JAN 7

On January 7, on the occasion of Vaikunta Dwadasi, Sri Sudarshana Chakrattalwar will be offered Chakrasnanam in the Swami Pushkarini.

CANCELLATION OF ALL ARJITA SEVAS

In view of special rituals at Srivari temple on both Vaikuntha Ekadasi and Dwadasi days, the TTD had decided to cancel all arjita sevas like Kalyanotsvams, Arjita Brahmotsavams, and Vasantotsavams etc.  From January 5-7.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

 

తిరుమల శ్రీవారి ఆలయంలో జ‌న‌వ‌రి 6న వైకుంఠ ఏకాద‌శి, 7న వైకుంఠ ద్వాద‌శి

డిసెంబ‌రు 23, తిరుమల 2019: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జ‌న‌వ‌రి 6న వైకుంఠ ఏకాదశి, 7న వైకుంఠ ద్వాదశి పర్వదినాలు జ‌రుగ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా శ్రీ‌వారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.  

ఇందులో భాగంగా జ‌న‌వ‌రి 6న తెల్లవారుజామున 12.30 నుండి 2 గంటల వరకు ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, తోమాల, కొలువు, పంచాంగ శ్ర‌వ‌ణం నిర్వహిస్తారు. అనంతరం భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.

ఉద‌యం 9 గంట‌ల‌కు స్వ‌ర్ణ‌ర‌థం..

ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు సహస్రదీపాలంకార సేవ కన్నులపండుగగా జరుగనుంది. అనంతరం స్వామివారు ఉభయనాంచారులతో క‌లిసి తిరుచ్చిపై నాలుగమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు రంగ‌నాయ‌కుల మండ‌పంలో అధ్య‌య‌నోత్స‌వ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.

జ‌న‌వ‌రి 7న చ‌క్ర‌స్నానం

జ‌న‌వ‌రి 7వ తేదీన‌ వైకుంఠ ద్వాదశి పర్వదినాన స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి తిరుమలలో ఘనంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 4.30 గంటల నుండి 5.30 గంటల వరకు శ్రీ చక్రత్తాళ్వార్లను నాలుగుమాడ వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లి వరాహస్వామి ఆలయం చెంత గ‌ల‌ స్వామివారి పుష్కరిణి తీర్థంలో చక్రస్నానం నిర్వహిస్తారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి ప‌ర్వ‌దినాల నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 5 నుండి 7వ తేదీ వ‌ర‌కు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం ఆర్జిత‌సేవ‌ల‌ను టిటిడి రద్దు చేసింది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది