TIRUMALA GETS CLEANSING WITH AROMATIC “PARIMALAM”_ శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

KOIL ALWAR TIRUMANJANAN PERFORMED

Tirumala, 13 March 2018: The traditional temple cleansing ritual “Koil Alwar Tirumanjanam” was performed with religious fervour on Tuesday in Tirumala temple.

A special aromatic mixture “Parimalam” is applied to walls, roof of entire sanctum sanctorum, sub-temples after cleansed with water jet. While the entire process was underway, the presiding deity was covered with a white veil.
It took over three hours for cleansing of temple and puja utensils.

Later the veil on Mula Virat was removed and special puja was performed.

TTD EO Sri Anilkumar Singhal, JEO Tirumala Sri KS Sreenivasa Raju, Temple DyEO Sri Harindranath and other officers, temple staffs were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

మార్చి 13, తిరుమల 2018: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 18న శ్రీ విళంబినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని టిటిడి అత్యంత ఘనంగా నిర్వహించింది.

ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ సంవత్సరంలో నాలుగుసార్లు ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మూెత్సవం పర్వదినాలకు ముందుగా వచ్చే మంగళవారంనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలియచేశారు.

ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆర్జిత సేవలైన ఆష్టదళపాదపద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది. ఇతర ఆర్జిత సేవలు యధాతథంగా నిర్వహించారు.

ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రంగా కడిగారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును శ్వేత వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన తర్వాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన లేపనంతో ఆలయగోడలకు పూశారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు అత్యంత పవిత్రంగా ఒక మహా యజ్ఞంలా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు.

అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి, మధ్యాహ్నం 12.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు, సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణ, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.