TIRUMALA GHAT ROAD RESTRICTIONS RELAXED _ తిరుమల ఘాట్‌ రోడ్లలో ఆంక్షల సడలింపు – టీటీడీ ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి

Tirumala, 29 September 2023: TTD relaxed the restrictions on the movement of two-wheelers which came into force with immediate effect from Saturday onwards.

The TTD EO Sri AV Dharma Reddy made an announcement in this regard during the review meeting with TTD officials at Annamaiah Bhavan in Tirumala on Saturday evening.

In view of the movement of wild cats in Alipiri footpath, keeping in view the safety of devotees, TTD restricted the movement of two-wheelers from 6pm to 6am.

But with TTD forest along with state forest department trapping six wild cats in the area and the authorities confirming no further threat after pursuing for a week, decided to relax the restrictions on the timings over the movement of two-wheelers.

Henceforth the two-wheelers will be allowed to ply on ghat roads upto 10pm.

NAVARATRI BRAHMOTSAVAM ARRANGEMENTS REVIEWED

The EO also reviewed with the officials about the preparation by the concerned departments for the upcoming Navaratri Brahmotsavams scheduled between October 15 to 23 with Ankurarpanam on October 14.

As more pilgrim rush is being anticipated for this festival due to Dasara holidays, the EO asked all the officials to put extra efforts to make the event successful on par with annual brahmotsavams with team work.

JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy and other officials and Heads of Departments were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

తిరుమల ఘాట్‌ రోడ్లలో ఆంక్షల సడలింపు – టీటీడీ ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి

– నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో సమీక్ష

తిరుపతి, 2023 సెప్టెంబరు 29: తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలను టీటీడీ సడలించింది. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం సాయంత్రం టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి ఈ మేరకు ప్రకటించారు.

అలిపిరి కాలినడక మార్గంలో చిరుతల సంచారం నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ నిలిపివేసిన విషయం తెలిసిందే. టీటీడీ అటవీశాఖతో అధికారులతోపాటు రాష్ట్ర అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో ఆరు చిరుతలను బంధించడంతో పాటు వారం రోజుల పాటు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించారు. దీంతో శుక్రవారం నుంచి ఘాట్ రోడ్లలో రాత్రి 10 గంటల వరకు ద్విచక్ర వాహనాలను అనుమతించనున్నారు.

అదేవిధంగా, అక్టోబరు 14న అంకురార్పణ, అక్టోబర్‌ 15 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల సంసిద్ధతపై శాఖల వారీగా అధికారులతో ఈవో సమీక్షించారు. దసరా సెలవుల కారణంగా యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అధికారులు సమన్వయంతో సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలో విజయవంతం చేయాలని కోరారు.

ఈ సమీక్షలో జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్‌వో శ్రీ నరసింహకిషోర్‌, ఎస్‌వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్‌కుమార్‌, సీఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఈ-2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.