TIRUMALA IS A ROLE MODEL PILGRIM CENTRE FOR CLEANLINESS_ పరిశుభ్రతకు టిటిడి పెద్దపీట పార్లమెంటరీ కమిటీ ఛైర్మెన్‌ శ్రీ టి. సుబ్బరామిరెడ్డి

Tiruchanoor, 27 April 2018: Describing the environs of Tirumala as clean and tidy, the Chairman of Parliamentary committee on sub-ordinate Legislation Dr T Subbirami Reddy said, Tirumala is a role model temple to all other centres.

After darshan of Lord Venkateswara at Tirumala and Goddess Padmavathi Devi in Tiruchanoor speaking to media he said, the solid waste management system is also best utilised in Tirumala. Out of 90 tonnes of waste 30 tonnes are being converted into manures and the remaining 60 tonnes for preparing cement”, he maintained.

TTD EO Sri AK Singhal, temple spl.gr.dyeo sri P Muni Ratham Reddy were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

పరిశుభ్రతకు టిటిడి పెద్దపీట పార్లమెంటరీ కమిటీ ఛైర్మెన్‌ శ్రీ టి. సుబ్బరామిరెడ్డి

తిరుపతి,2018 ఏప్రిల్‌ 27: టిటిడిలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నారని పార్లమెంటరీ కమిటీ ఆన్‌ సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ ఛైర్మెన్‌ శ్రీ టి. సుబ్బరామిరెడ్డి వెల్లడించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శుక్రవారం ఉదయం ఆయన దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ తిరుమలలో రోజుకు 90 టన్నుల వ్యర్థాలు వస్తున్నాయని, వీటిని వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం ఉపయోగించి మళ్లీ సద్వినియోగం చేసుకునే ప్రక్రియ బాగుందన్నారు. మొత్తం 90 టన్నులలో 30 టన్నుల వ్యర్థాలను వర్మీ కంపోస్ట్‌ ద్వారా ఎరువుల తయారీకి ఉపయోగించే పద్దతిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. మిగిలిన 60 టన్నులను సిమెంట్‌ తయారీకి ఉపయోగించేలా ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. భక్తులకు ఇచ్చే ప్రసాదాలను చాలా పరిశుభ్రంగా తయారు చేస్తున్నారని అన్నారు. 120 ఎకరాలలో చందనం మొక్కల పెంపకం, అతిథిగృహాల నిర్వహణ చాలా బాగుందన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం చాలా పరిశుభ్రంగా ఉందన్నారు. టిటిడి యంత్రాంగం పటిష్టంగా పనిచేస్తోందని అభినందించారు.

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నాక ఆయనకు వేదాశీర్వచనం, శేషవస్త్రం, అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు. శ్రీ సుబ్బరామిరెడ్డి వెంట పార్లమెంటరీ కమిటీ మెంబర్‌ డా.సంజయ్‌సేత్‌, టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌ శ్రీనివాసరాజు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఈవో శ్రీ మునిరత్నం రెడ్డి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌ రెడ్డి,డిప్యూటీ ఈవో శ్రీ టి.ఎస్‌. కస్తూరి, ఏవీఎస్‌వో శ్రీ పార్థసారథిరెడ్డి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.