SAINT POETESS WAS AN ARDENT DEVOTEE OF LORD_ తిరుపతిలో ఘనంగా వెంగమాంబ 288వ జయంతి ఉత్సవాలు ప్రారంభం

Tirupati, 27 April 2018: Describing the dedicated devotion of Saint poetess Tarigonda Vengamamba towards Lord Venkateswara as eternal, Dr KJ Krishnamurthi, the co-ordinator of Tarigonda Vengamamba Project said she sanctified her life by serving Lord.

Addressing the literary meet organised on the occasion of 288th Birth Anniversary of the Saint Poetess at Annamacharya Kalamandiram in Tirupati on Friday, he said the great poetess penned 18 literary works which also includes the famous Venkatachala Mahatyam.

PUSHPANJALI PERFORMED

Floral tributes have been paid to the statue of Matrusri Tarigonda Vengamamba in Tirupati on Friday at MR Palle Circle.

Tarigonda Vengamamba Project co-ordinator Dr KJ Krishnamurthi, Annamacharya Project Director Sri Dhanajeyulu, Puranetihasa Project special officer Dr Samudrala Lakshmanaiah took part in this fete.

Later in the evening devotional cultural programmes were held at Annamacharya Kalamandiram.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

శ్రీవారి ఆంతరంగిక భక్త శిరోమణి వెంగమాంబ : ఆచార్య కె.జె. కృష్ణమూర్తి

తిరుపతిలో ఘనంగా వెంగమాంబ 288వ జయంతి ఉత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2018 ఏప్రిల్‌ 27: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ శ్రీవారి ఆంతరంగిక భక్త శిరోమణిగా గుర్తింపు పొందారని తరిగొండ వెంగమాంబ వాఙ్మయ ప్రాజెక్టు సమన్వయాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి తెలియజేశారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం తరిగొండ వెంగమాంబ 288వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య కె.జె.కృష్ణమూర్తి మాట్లాడుతూ వెంగమాంబ తన జన్మస్థలమైన తరిగొండలో 5, తిరుమలలో 13 కలిపి మొత్తం 18 రచనల ద్వారా స్వామివారి కీర్తిని ఇనుమడింపచేశారని తెలిపారు. వీటిలో 1600 గద్య పద్యాలతో కూడిన ‘వేంకటాచల మహత్యం’ విశిష్టమైందన్నారు. భారత, భాగవత, రామాయణాల తరహాలో వేంకటాచల మహత్యం అంతటి పవిత్రమైందని తెలిపారు. సంకీర్తనల్లోని భావాన్ని ప్రజల బాణీలోనే తెలియజేసిన ఘనత అన్నమయ్య, వెంగమాంబకు దక్కిందన్నారు. ఈమె వ్యక్తిగా, సంస్కర్తగా, యోగినిగా, కవయిత్రిగా శ్రీవారి భక్తితత్వాన్ని ప్రచారం చేశారని వివరించారు.

వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి :

తరిగొండ వెంగమాంబ జయంతి సందర్భంగా ఉదయం 9.00 గంటలకు తిరుపతిలోని ఎంఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద గల వెంగమాంబ విగ్రహానికి తితిదే ప్రాజెక్టుల సమన్వయాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీ కె.ధనుంజయుడు పుష్పాంజలి సమర్పించారు.

ఈ కార్యక్రమంలో పురాణఇతిహాస ప్రాజెక్ట్‌ ప్రత్యేకాధికారి శ్రీ సముద్రాల లక్ష్మణయ్య, ఆచార్య కుసుమకుమారి, డా.ఐ. రాధాకృష్ణ, డా.ఎన్‌.చాముండేశ్వరరావు, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీ కె.ధనుంజయుడు, ఏఈవో శ్రీమతి. భారతి, అన్నమాచార్య ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ డా||సి.లత ఇతర అధికార ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

సాయంత్రం 6.00 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులచే సంగీత సభ జరుగనుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.