TIRUMALA JEO FORMALLY LAUNCHES THE TRAINING CLASS FOR FIRST BATCH OF LADDU PRASADA SEVAKULU _ తిరుమలలో లడ్డూ ప్రసాదసేవ శిక్షణా శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించిన తిరుమల జె.ఇ.ఓ 

TIRUMALA, JAN 12:  Tirumala JEO Sri KS Sreenivasa Raju has formally launched the training programme for the first batch of Laddu Prasada Sevakulu, which forms a wing in Srivari Seva voluntary service run by TTD on Saturday. The Laddu Prasada Seva will commence on Sunday i.e. January 13 on the occasion of Bhogi-Sankranthi festival.

 

In his address, the JEO said with the successful outcome of Parakamani Seva which was launched during August last, TTD has introduced this unique Laddu Prasada Seva to offer better services to pilgrims in an effective manner. He called upon the volunteers who came to render services to pilgrims in VQC I laddu prasadam counters, to dedicate in the service of pilgrims by offering their services in a more effective and transparent manner. “Our staff, vigilance and bank staff will guide you so that you will discharge you duties in a proper way and without any inconvenience”, he added.

 

Earlier the laddu prasada seva has been demonstrated to the volunteers through a mini-documentary film. Meanwhile in the first batch, 27 persons have enrolled on-line while 22 reported for the service.

 

CVSO Sri GVG Ashok Kumar, Additional CVSO Sri Shivakumar Reddy, Temple Dy EO Sri Chinamgari Ramana, AEO Potu Sri Keshava Raju, Temple Peishkar Sri Kodanda Rama Rao and other officials were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో లడ్డూ ప్రసాదసేవ శిక్షణా శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించిన తిరుమల జె.ఇ.ఓ

తిరుమల, 12 జనవరి 2013: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులకు వైకుంఠం-1 లడ్డూ కౌంటరులో మరింత పారదర్శకంగా అందించడానికి గాను 2013 జనవరి 13వ తేది నుండి ”లడ్డూ ప్రసాద సేవ” ను తి.తి.దే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనుందని తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు అన్నారు.
 
శనివారంనాడు తిరుమలలోని శ్రీవారి సేవాసదన్‌ కార్యాలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించి మొదటి బ్యాచ్‌ లడ్డూసేవా శిక్షణా శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం లడ్డూప్రసాద సేవకులకు సేవలందించవలసిన విధానాన్ని గురించి లఘు చిత్రాన్ని ప్రదర్శించి వారికి తగిన శిక్షణ కార్యక్రమం ద్వారా వివరించడం జరిగింది.
ఈ సందర్భంగా లడ్డూ ప్రసాదసేవకులను ఉద్ధేశించి జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు మాట్లాడుతూ గత ఏడాది ఆగస్టు 17న తి.తి.దే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘పరకామణిసేవ’ విశేష ఫలితాలను అందిచడంతో, అదే ప్రేరణతో తి.తి.దే ‘లడ్డూప్రసాదసేవ’ ను ప్రవేశపెట్ట నిర్ణయించిందని. అందులో భాగంగా ముందుగా వైకుంఠం-1 మరియు అదనపు లడ్డూ కౌంటర్లల ప్రాంతాలలో చెరో నాలుగు కౌంటర్లలలో ప్రయోగాత్మకంగా ఈ నూతన సేవను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. భక్తులకు పారదర్శకమైన సేవలను అందించాలన్న సదుద్ధేశంతో తి.తి.దే లడ్డూ ప్రసాదసేవను ప్రవేశ పెట్టిందని ఆయన తెలిపారు.
 
విశేషమైన పండుగరోజులలో కూడా ఇంతమంది సేవకులు శ్రీవారి భక్తులకు సేవ చేయాలన్న సదు ద్దేశంతో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడానికి వచ్చిన లడ్డూప్రసాద సేవకులకు కృతజ్ఞతలు తెలిపారు. లడ్డూ ప్రసాదసేవ సమర్థవంతంగా నిర్వహించడానికి విచ్చేసిన లడ్డూప్రసాద సేవకులకు విధి నిర్వహణలో తి.తి.దే సిబ్బంది, బ్యాంకు సిబ్బంది, విజిలెన్స్‌ అధికారులు సలహాలు, సూచనలు అందిస్తారని అన్నారు.
 
ఈ కార్యక్రమంలో తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జి.వి.జి అశోక్‌ కుమార్‌, ఆలయ డిప్యూటి ఇ.ఓ శ్రీ చిన్నంగారి రమణ, అదనపు ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ శివకుమార్‌ రెడ్డి, ఆలయ పెష్కార్‌ శ్రీ కోదండరామారావు, ఆలయ పోటు పేష్కార్‌ శ్రీ కేశవరాజు, తి.తి.దే ఉన్నతాధి కారులు మరియు శ్రీవారిసేవకులు పాల్గొన్నారు..
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.