TIRUMALA JEO INSPECTS BRAHMOTSAVAM ARRANGEMENTS ALONG WITH CVSO AND TIRUPATI URBAN SP_ సామాన్య భక్తులకు పెద్దపీఠ – తిరుమల జె.ఇ.ఓ

Tirumala, 16 September 2017: As the annual brahmotsavams of Lord Venkateswara will be commencing from next Saturday, the Tirumala JEO Sri KS Sreenivasa Raju had inspected various places for parking in the hill town for the ensuing Brahmotsavams along with CVSO of TTD Sri A Ravikrishna and Tirupati Urban SP Sri Abhishek Mohanty on Saturday.

Later speaking to media persons, the JEO said, as this year the first day annual fete coincides with First Saturday of Tamil Purattasi month coupled with Dussera holidays, heavy pilgrim crowd is being anticipated from day one of Brahmotsavams. “We are making all arrangements accordingly. On Garuda Seva day, there is parking facility in Tirumala for seven thousand four wheelers beyond which will be accommodated at Devalok and Bhavan’s school premises in Tirupati for that day. The pilgrims will be given parking and traffic plan copies at Alipiri itself for better information. The Tirupati JEO Sri P Bhaskar is making necessary arrangements of food, water, information counters etc.in these areas. The APSRTC will transport pilgrims from these two places to Tirumala”, he added.

Adding further, the JEO said, on Garuda Seva day on September 27, the Vahanam procession will commence by 7:30pm and lasts up to 1am. “The pilgrims will not be allowed to move in galleries on that day, half an hour after the completion of morning Seva. Annaprasadam will be distributed to pilgrims from 12 noon till 6pm in galleries. Additional temporary toilets are also constructed in the galleries. For those who could not make into the galleries we have arranged giant LED screens at various places in Tirumala to witness the Vahana sevas. The pilgrims are also requested to co operate with the TTD security and police departments and follow the traffic rules and regulations for the smooth run of the mega event”, he added.

SE II Sri Ramachandra Reddy, SE Electrical Sri Venkateswarulu, VGO Sri Ravindra Reddy, DyEO Sri Venugopal, and others were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

సామాన్య భక్తులకు పెద్దపీఠ – తిరుమల జె.ఇ.ఓ

సెప్టెంబర్‌ 15, తిరుమల 2017: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మూెత్సవాలు సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 1 వరకు జరుగనున్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లు దాదాపు పూర్తికావచ్చాయని, భక్తులకు సాధ్యమైనంత మేరకు సేవలందించడమే తి.తి.దే ప్రధాన లక్ష్యమని తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఉద్ఘాటించారు.

శనివారంనాడు ఆయన తిరుమలలోని పలు ప్రాంతాలలో వాహనాల పార్కింగ్‌ స్థలాలను పరిశీలించారు. ఇందులో భాగంగా నూతన శ్రీవారి సేవాసదన భవన సముదాయల చెంత ఉన్న పార్కింగ్‌ స్థలాన్ని తి.తి.దే సి.వి.ఎస్‌.ఓ శ్రీ ఆకె.రవికృష్ణ, తిరుపతి అర్బన్‌ ఎస్‌.పి శ్రీ అభిషేక్‌మహంతిలతో కూడి పరిశీలించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈసారి బ్రహ్మూెత్సవాలు ప్రారంభమయ్యే రోజునే తమిళ పెరటాసిమాస తొలి శనివారం కూడా రానుండడంతో బాటు దసరా సెలవులు కూడా ప్రారంభమవుతాయి కనుక గతంకంటే ఎక్కువగా భక్తులు రానున్నట్లు అంచనా వేస్తున్నామని అన్నారు. అందుకు తగ్గట్లుగా అన్ని విభాగాలవారు విసృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ ఏడాది వాహనాల పార్కింగ్‌ సౌలభ్యానికి, ట్రాఫిక్‌ సమస్యలు అధిగమించడానికి మూడవ విడత రింగ్‌రోడ్డును ఏర్పాటు చేశామన్నారు. తిరుమలలో 7000 నాలుగు చక్ర వాహనాలకు పార్కింగ్‌ కొరకు స్థలం ఉందన్నారు గరుడసేవనాడు ఈ సంఖ్య దాటితే తిరుపతిలోనే దేవలోక్‌ మరియు భవన్స్‌ పాఠశాల ప్రాంగణంలో చతుశ్చక్రవాహనాల కొరకు పార్కింగ్‌ కేటాయించడం జరిగిందన్నారు. ఆయా ప్రాంతాల నుండి తిరుమలకు చేరుకోవడానికి ఏ.పి.ఎస్‌ ఆర్‌.టి.సి వాహనాలు నడుపుతుందన్నారు. అలిపిరి చెంతనే భక్తులకు తిరుమలలో వాహన పార్కింగ్‌ స్థలాల ప్రణాళిక ప్రతులను అందించడం జరుగుతుందన్నారు. భక్తులు, తి.తి.దే విజిలెన్స్‌ మరియు పోలీసు సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.

భక్తుల సౌకర్యార్థం సెప్టెంబరు 27న గరుడసేవను రాత్రి 7.30 గంటలకే ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఆ రోజు ఉదయం వాహనం పూర్తియిన ఆరగంట తరువాత నాలుగు మాడ వీధులలో భక్తులను అనుమతించమన్నారు. గ్యాలరీలో వేచివుండే భక్తులకు అన్నప్రసాదాలను మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. గ్యాలరీలలో భక్తుల కొరకు అదనపు మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్యాలరీల బయట, తిరుమలలోని వివిధ ప్రాంతాలలో ఎల్‌.ఇ.డి బోర్డులను ఏర్పాటుచేసి భక్తులు వాహన సేవలు తిలకించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

ఈ తణిఖీల్లో జె.ఇ.ఓతో పాటు ఎస్‌.ఇ2 శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌.ఇ ఎలక్ట్రికల్‌ శ్రీ వెంకటేశ్వరులు, అన్నప్రసాద డిప్యూటి.ఇ.ఓ శ్రీ వేణుగోపాల్‌, వి.జి.ఓ శ్రీ రవీంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.