TIRUMALA JEO REVIEWS IN DETAIL ON SEVA SADAN WORKS_ శ్రీవారి సేవాగ్రామంగా తిరుమల : జెఈవో శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు
BUILDING UP STRONGHOLD “SEVA GRAMAM” IS OUR AIM
NEW SEVA SADANAM COMPLETES BY THIS APRIL
Tirupati, 12 January 2018: The aim of TTD is to establish a strong hold “Seva Gramam” with the dedicated sevakulu to render best possible services to pilgrims, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.
During the review meeting in the chambers of Chief Engineer on Friday noon, the JEO reviewed in detail about the stage of works under progress in new seva building coming up behind Kalyana Vedika in Tirumala at Rs.80cr.
The JEO reviewed on the RO water facilities, solar power with electrical backup, CCTVs, LED screens, audio system, annaprasadam etc. need to be facilitated in the upcoming seva building with the officials concerned.
The JEO also directed the garden wing chief Sri Srinivasulu to come with an action plan of green scape surrounding the new seva building.
The JEO instructed PRO and head of Srivari Seva to ensure that sevakulu present in the required numbers all through the year and not alone during festive days by giving wide publicity on 3-day, 4-day and special occasion on-line seva also.
CE Sri Chandrasekhar Reddy, SEs Sri Ramachandra Reddy, Sri Venkateswarulu, IT head Sri Sesha Reddy, Health Officer Dr Sermista, Special Officer Annaprasadam Sri Venugopal, Catering Officer Sri Sastry, VI Communications Sri Mahesh were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి సేవాగ్రామంగా తిరుమల : జెఈవో శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు
తిరుమల, 2018 జనవరి 12: శ్రీవారి భక్తులకు విశేషంగా సేవలందించేందుకు విచ్చేసే శ్రీవారి సేవకులతో ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచే ఒక సేవాగ్రామాన్ని తిరుమలలో నిర్మించే దిశగా టిటిడి అడుగులు వేస్తోందని తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో శ్రీవారి సేవపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో ప్రవేశపెట్టిన 7 రోజులు, 4 రోజులు, 3 రోజులు, ప్రత్యేక సందర్భాల్లో 2 రోజుల స్లాట్లకు సేవకుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. సంవత్సరం పొడవునా నిస్వార్థమైన, ఉత్తమమైన సేవలు అందించేందుకు పెద్ద సంఖ్యలో శ్రీవారిసేవకులు విచ్చేయాలని పిలుపునిచ్చారు. ఆయా రంగాల్లో నిపుణులైన సేవకులు పాల్గొనాలని కోరారు. శ్రీవారి సేవా సదన్ నూతన భవన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. నూతన భవనంలో అన్నప్రసాదాలు, ఆర్‌వో తాగునీటి ప్లాంటు, సోలార్ హీటర్లు, భవనం చుట్టూ ఆహ్లాదంగా ఉద్యానవనం, సిసిటివిలు, శిక్షణ కోసం ఎల్‌ఇడి స్క్రీన్లు, స్పీకర్లు తదితర వసతులు కల్పించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. శ్రీవారి సేవలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆన్‌లైన్ అప్లికేషన్‌లో తగిన మార్పులు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్) శ్రీ వేంకటేశ్వర్లు, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ కోదండరామారావు, ఆరోగ్యశాఖాధికారి డా|| శర్మిష్ట, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్, క్యాటరింగ్ అధికారి శ్రీ శాస్త్రి, గార్డెన్ అధీక్షకులు శ్రీ శ్రీనివాస్, కమ్యూనికేషన్స్ విఐ శ్రీ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.