TIRUMALA MILLING WITH V DAY CROWD_ భక్తులతో నిండిన నారాయణగిరి ఉద్యానవనాలు, మాడ వీధుల్లోని షెడ్లు

* Non-stop supply of Anna Prasadam, drinking water
* Bhakti sangeet, bhajans regaling devotees
* Sevakulu and scouts offering impeccable services

Tirumala, 17 Dec. 18: It is a sea of humanity as countless devotees braving chill weather, have been trickling to Tirumala in all modes for the holy Vaikunta dwara darshan of Lord Venkateswara on Ekadasi and Dwadasi day.

As crowd has been occupying the queue lines of VQC and later the sheds at Narayanagiri gardens and Mada streets for their anxious wait for darshan tomorrow, the TTD has rolled out continuous supply of snacks, Anna Prasadam, drinking water, coffee, tea, milk etc.

The artists of HDPP, Annamacharya project and Dasa sahitya project are staging bhajans and Bhakti sangeet. The TTD radio and broadcast services are keeping the devotees informed about darshan hours and available amenities in sheds and quelled lines.

A total of 128 toilets are laid out for women and 101 for men at the Narayanagiri gardens sheds. Similarly 176 toilets for women and 164 toilets for men haven been set up in the sheds of mada streets. Special focus is given for cleaning and garbage clearance and first aid centres to provide emergency Medicare.

Srivari Sevakulu haven deployed for all wings, queue lines, food distribution.
Seventeen LED screens have set up (8 in mada streets, 3 filter house circle, 6 others at Medaramitta, Gangamma Gudi, Kalyan vedika and new seva Sadan blogs) to portray religious and spiritual programs for devotees.

SWARNA RATHAM ON DEC 18

TTD has rolled out Swarna Ratha procession of lord Malayappaswamy on mada streets on December 18 and Chakrasnanam of Sri Chakrathalvar in Swami Pushkarani on December 19.

The First Ekadasi in Dhanur masam (Shukla paksham) also known as Mukkoti Ekadasi and mokshada Ekadasi and legends say that devotees who beget darshan of Lord Venkateswara and also chakrnanam next day will beget bliss.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

భక్తులతో నిండిన నారాయణగిరి ఉద్యానవనాలు, మాడ వీధుల్లోని షెడ్లు

నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ

ఆకట్టుకునేలా భజన కార్యక్రమాలు

డిసెంబరు 17, తిరుమల 2018: డిసెంబ‌రు 18న వైకుంఠ ఏకాదశి పర్వదినం సంద‌ర్భంగా శ్రీ‌వారిని దర్శించుకునేందుకు సోమ‌వారం విశేషంగా భక్తులు తరలివచ్చారు. నారాయణగిరి ఉద్యానవనాలు, మాడ వీధుల్లో ఏర్పాటుచేసిన షెడ్లు సాయంత్రానికి పూర్తిగా నిండిపోయాయి. ఇక్కడ వేచి ఉన్న భక్తులకు టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, టి, కాఫి, పాలు పంపిణీ చేశారు.

భక్తులకు ఆధ్యాత్మికానందం కల్పించేందుకు టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా భ‌జ‌న కార్యక్ర‌మాలు ఏర్పాటుచేశారు. రేడియో, బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి దర్శనానికి పట్టే సమయం, కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్ల వివరాలు, భక్తులకు అందిస్తున్న వసతులను ఎప్పటికప్పుడు ప్రకటనల ద్వారా తెలియజేస్తున్నారు. నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో షెడ్ల‌కు అనుసంధానంగా మ‌హిళ‌ల కోసం 128, పురుషుల కోసం 101 మ‌రుగుదొడ్లు, ఆల‌య నాలుగు మాడ వీధుల్లో షెడ్ల‌కు అనుసంధానంగా మ‌హిళ‌ల కోసం 176, పురుషుల కోసం 164 మ‌రుగుదొడ్లు ఏర్పాటుచేశారు. మెరుగైన పారిశుద్ధ్యం కోసం అదనంగా సిబ్బందిని ఏర్పాటుచేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. టిటిడి వైద్య విభాగం ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటుచేసి అవసరమైన మందులను భక్తులకు అందిస్తున్నారు. శ్రీవారి సేవకుల సాయంతో కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లు, షెడ్ల‌లోని భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నారు. భ‌క్తుల కోసం ఆల‌య మాడ వీధుల్లో 8, నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో 3, ఫిల్ట‌ర్ హౌస్ స‌ర్కిల్‌, మేద‌ర‌మిట్ట‌, బాట గంగ‌మ్మ‌గుడి, క‌ల్యాణ‌వేదిక‌, నూత‌న సేవాస‌ద‌న్ ప్రాంతాల్లో 6 క‌లిపి మొత్తం 17 ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటుచేసి ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాలు ప్ర‌సారం చేస్తున్నారు.

డిసెంబ‌రు 18న‌ స్వ‌ర్ణ‌ర‌థం..

డిసెంబ‌రు 18వ తేదీ మంగ‌ళ‌వారం ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. డిసెంబ‌రు 19వ తేదీన‌ వైకుంఠ ద్వాదశి పర్వదినాన స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి కూడా తిరుమలలో ఘనంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 4.30 గంటల నుండి 5.30 గంటల వరకు శ్రీ చక్రత్తాళ్వార్లను నాలుగుమాడ వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లి వరాహస్వామి ఆలయం చెంత గ‌ల‌ స్వామివారి పుష్కరిణి తీర్థంలో చక్రస్నానం నిర్వహిస్తారు.

వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం..

ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. దీనిని ముక్కోటి ఏకాదశిగా కూడా నిర్వచిస్తారు. ఏకాదశినాడు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుని స్వర్ణరథోత్సవంలో పాల్గొనే భక్తులకు మూడుకోట్ల ఏకాదశుల పుణ్యఫలం దక్కుతుందని పురాణ ప్రాశస్త్యం. శ్రీస్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన స్నానమాచరించిన వారికి తిరుమల శేషగిరుల్లో వెలసిన పుణ్యతీర్థాల స్నానఫలం దక్కుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది.

వైకుంఠ ద్వార దర్శనం..

వైకుంఠ ఏకాదశినాడు సుప్రభాత సమయం నుంచి మరుసటిరోజు ద్వాదశి నాటి రాత్రి ఏకాంతసేవ వరకు శ్రీవారి గర్భాలయానికి దగ్గరగా అనుకుని ఉన్న ”ముక్కోటి ప్రదక్షిణమార్గం” తెరవబడుతుంది. ఈ ద్వారాలను వైకుంఠ ద్వారాలని, ఉత్తర ద్వారాలని అంటారు. ఈ మార్గాన్ని ”వైకుంఠ ప్రదక్షిణమార్గం” అని అంటారు. విద్యుద్దీపాలతో, సుగంధ మనోహర పుష్పాలతో అలంకరించిన ఈ వైకుంఠ ప్రదక్షిణంలో ప్రవేశించే భాగ్యం ఏడాదిలో ఈ రెండు రోజులు మాత్రమే కలుగుతుంది. స్వామివారిని దర్శించిన తరువాత వైకుంఠ ప్రదక్షిణంలో ప్రవేశం కలుగుతుంది. ఈ మార్గంలో ప్రవేశించిన భక్తులకు పూర్వపాపకర్మలు నశిస్తాయని, ఇష్టార్థాలన్నీ నెరవేరతాయని పురాణ ప్రాశస్త్యం.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.