DEVOTEES HAPPY ON V DAY ARRANGEMENTS, SAYS TTD CHAIRMAN_ వైకుంఠ ఏకాద‌శి ఏర్పాట్ల‌పై సామాన్య భ‌క్తుల సంతృప్తి : టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌

Tirumala, 17 Dec. 18: TTD Chairman Sri Putta Sudhakar Yadav said today that the Common devotees are happy about all initiatives taken by TTD for smooth conduction of Vaikunta Ekadasi and Dwadasi festivals.

After a spot inspection of all arrangements at the sheds of Narayanagiri gardens and Mada streets the chairman said As many as 70,000 devotees had gathered by Monday evening in the brand blew queue lines prepared with German Technology at a cost of Rs. 4.75 crore to protect the devotees from cold and morning fog chill.

He said besides toilets and Medicare the devotees were also given drinking water, buttermilk, tomato rice, sambar rice etc. and bhajan program were also organised to keep then engaged spiritually. Henceforth the same sheds will be used for devotee benefit during the festival days of Brahmotsavam and Ratha Sapthami.

He said on both V Days arrangements were made to price. 40 hours of darshan to approximately 150000 devotees’ .The Tirumala ghat roads will also be kept open for 24 hours and appealed to devotees to enjoy hassle free darshan

TTD FACAO Sri O Balaji, SE Sri Ramachandra Reddy, Annaprasadam OSD Sri Venugopal and other officials participated in the Chairman visit.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వైకుంఠ ఏకాద‌శి ఏర్పాట్ల‌పై సామాన్య భ‌క్తుల సంతృప్తి : టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌

డిసెంబ‌రు 17, తిరుమల 2018: వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి ప‌ర్వ‌దినాల సంద‌ర్భంగా టిటిడి చేప‌ట్టిన ఏర్పాట్ల‌పై సామాన్య భ‌క్తులు పూర్తి సంతృప్తి వ్య‌క్తం చేశార‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ తెలియ‌జేశారు. తిరుమ‌ల‌లోని నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాలు, మాడ వీధుల్లో ఏర్పాటుచేసిన షెడ్ల‌లో భ‌క్తుల‌కు అందుతున్న సౌక‌ర్యాల‌ను సోమ‌వారం సాయంత్రం ఛైర్మ‌న్ త‌నిఖీ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ సోమ‌వారం సాయంత్రానికి దాదాపు 70 వేల మంది భ‌క్తులు తిరుమ‌ల‌కు వ‌చ్చార‌ని తెలిపారు. రూ. 4.75 కోట్ల వ్య‌యంతో మొద‌టిసారిగా జ‌ర్మ‌న్ టెక్నాల‌జీతో షెడ్లు ఏర్పాటు చేశామ‌ని, ఇక్క‌డ భ‌క్తులు చ‌లికి, మంచుకు ఇబ్బందులు ప‌డ‌కుండా సౌక‌ర్య‌వంతంగా ఉన్నార‌ని వివ‌రించారు. వేచి ఉన్న భ‌క్తుల‌కు ఉద‌యం నుండి ఉప్మా, పాలు, మ‌జ్జిగ‌, ట‌మోటా రైస్‌, సాంబార‌న్నం, తాగునీరు అందించార‌ని, మ‌రుగుదొడ్ల వ‌స‌తి ఉంద‌ని, అవ‌స‌ర‌మైన‌వారికి వైద్య‌సేవలు అందిస్తున్నార‌ని చెప్పారు. షెడ్ల‌లో ఏర్పాటుచేసిన భ‌జ‌న కార్య‌క్ర‌మాల‌తో భ‌క్తులు ఆధ్యాత్మిక అనుభూతికి లోన‌వుతున్నారని తెలియ‌జేశారు. ఇక‌పై బ్ర‌హ్మోత్స‌వాలు, ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినాల్లోనూ భ‌క్తులు ఎండ‌కు, వ‌ర్షానికి ఇబ్బందులు ప‌డ‌కుండా మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటుచేస్తామ‌న్నారు. ఏకాద‌శి, ద్వాద‌శి రోజుల్లో ల‌క్షా 50 వేల మందికి ద‌ర్శ‌నం చేయించ‌గ‌లమ‌ని, 40 గంట‌ల పాటు నిరంత‌రాయంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు ఏర్పాట్లు చేశామ‌ని తెలిపారు. భ‌క్తుల సౌక‌ర్యార్థం 24 గంట‌లపాటు ఘాట్ రోడ్లు తెర‌చి ఉంచామ‌న్నారు. ఎక్క‌డా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశామ‌ని, భ‌క్తులు తోపులాట‌లు లేకుండా ఓర్పుతో స‌హ‌క‌రించాల‌ని ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు.

ఛైర్మ‌న్ వెంట టిటిడి ఎఫ్ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, అన్న‌ప్ర‌సాదం ప్ర‌త్యేకాధికారి శ్రీ వేణుగోపాల్ ఇత‌ర అధికారులు ఉన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.