TIRUMALA NAMBI SATTUMORA HELD _ శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో తిరుమ‌ల‌నంబి సాత్తుమొర‌

TIRUPATI, 06 NOVEMBER 2021: Tirumala Nambi Sattumora was held in Sri Govindaraja Swamy temple on Saturday evening.

As part of this event, Srivari Appam Prasadam brought from Tirumala temple was offered to Tirumala Nambi during Asthanam.

Both Pedda Jeeyar and Chinna Jeeyar Swamijis of Tirumala, Special Grade DyEO Sri Rajendrudu and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో తిరుమ‌ల‌నంబి సాత్తుమొర‌

తిరుపతి, 2021 న‌వంబ‌రు 06: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఉప ఆలయమైన శ్రీ తిరుమలనంబి ఆలయంలో శ‌నివారం సాయంత్రం సాత్తుమొర నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారిని తిరుమలనంబి ఆలయానికి వేంచేంపు చేసి ఆస్థానం నిర్వహించారు. సాయంత్రం తిరుమలనంబి ఆలయంలో ప్రబంధపారాయణం, సాత్తుమొర చేప‌ట్టారు. ఈ సందర్భంగా తిరుమల నుండి తీసుకొచ్చిన శ్రీవారి అప్పాన్ని తిరుమలనంబికి స‌మ‌ర్పించారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆల‌య ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ నారాయ‌ణ‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కామ‌రాజు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.