TTD CANCELS VIP BREAK DARSHAN FROM NOVEMBER 13 TO 15 _ నవంబరు 13, 14, 15వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు

TIRUMALA, 06 NOVEMBER 2021: In connection with Southern Zonal Council meet in Tirupati on November 14, TTD has cancelled VIP Break Darshan on November 13, 14 and 15.

As the Chief Ministers from all Southern States, some Union Territories and also the Union Home Minister are expected to participate in this Zonal meet, TTD has cancelled Break Darshan on November 13, 14 and 15.

No letters for VIP Break Darshan shall be entertained on November 12, 13 and 14. The devotees are requested to make note of this and co-operate with TTD.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

నవంబరు 13, 14, 15వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు

నవంబ‌రు 12, 13 14వ తేదీల్లో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు

తిరుమల, 2021 న‌వంబ‌రు 06: తిరుప‌తి న‌గ‌రంలో నవంబరు 14వ తేదీన ద‌క్షిణాది రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌మావేశం ఉన్న నేప‌థ్యంలో నవంబరు 13, 14, 15వ తేదీల్లో తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

ఈ కారణంగా నవంబ‌రు 12, 13 14వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. అదేవిధంగా, నవంబరు 13, 14, 15వ తేదీల్లో దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండదు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.