TIRUMALA RECEPTION RECEPTION WING IN THE PATH OF TRANSFORMATION _ తిరుమ‌ల‌లో పార‌ద‌ర్శ‌కంగా గ‌దుల కేటాయింపు

KITS RECEIVE PILGRIMS PAT

CARD PAYMENTS IMPROVES IN TIRUMALA

Tirumala, 17 Oct. 19: The Reception Wing of TTD in Tirumala is marching ahead with latest trends to win the Hearts of the multitude of visiting pilgrims. 

The pilgrims are also welcoming this new trendy transformation and lauding the efforts of TTD towards cashless transactions to enhance transparency in the accommodation system.

The Reception wing in Tirumala is Categorized as R1, R2 and R3 with the R1 dealing with VVIP accommodation while the remaining two comprising five Pilgrims Amenities Complexes (PACs), over 7000 rooms in the tariff ranging between Rs.50 to 1500. There are mini Kalyana Kattas, Food Courts and Jalaprasadam units in these areas to cater to the needs of the pilgrims. 

In PACs only locker facility is available for the pilgrims. There are 1256 lockers available in PAC 1,  3300 in PAC 2,  1850 in PAC 3,  in PAC 4 812 in Padmanabha Nilayam located in RTC bus stand. All these lockers are allotted to pilgrims through Locker Allotment System (LAS) application in a transparent manner. 

ACCOMMODATION KITS:

The kits introduced in the accommodation areas and PACs has been receiving huge reception from the pilgrims in the recent times. These kits includes pillows with covers, blankets and mats which will be provided by TTD to the pilgrims on the additional payment of Rs.10 for a pair of pillows with covers, Rs.10 for two mats, a blanket at Rs.10 and a woolen rug at Rs.20. 

SWIPING MACHINES:

The introduction of swiping machines in accommodation areas to encourage cashless transactions is also gaining response from pilgrim circles. When the VIP Reception area including Padmavathi and MBC are recording Cent Percent card payments, the areas covered under R2 and R3 including CRO General, TBC, Koustubham, Nandakam, Saptagiri Satralu which are allotted to common pilgrims are also showing good signs of improvement day by day with the percentage recorded between 55% to 60%.

KALYANA MANDAPAM HALLS

Apart from the common pilgrim accommodation allotment, the Reception wing of TTD also take care of the allotment of Kalyana Mandapams to the pilgrims who are desiring to wed in Tirumala at nominal rents. There are in total 10 such Kalyana Mandapams in Tirumala with the rentals ranging between Rs.200 to Rs.500.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమ‌ల‌లో పార‌ద‌ర్శ‌కంగా గ‌దుల కేటాయింపు

గ‌దులు దొర‌క‌నివారికి పిఏసిల్లో ఉచితంగా లాక‌ర్లు

వ‌స‌తి కిట్‌ల‌కు భ‌క్తుల నుండి విశేష స్పంద‌న‌
 
స్వైపింగ్ యంత్రాలతో పెరిగిన‌ న‌గ‌దు ర‌హిత లావాదేవీలు

అక్టోబర్ 17, తిరుమల 2019:  దేశం న‌లుమూల‌ల నుండి శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం తిరుమ‌ల చేరుకునే యాత్రికులకు టిటిడి స‌క‌ల సౌక‌ర్యాలు క‌ల్పిస్తోంది. సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేస్తూ పార‌ద‌ర్శ‌కంగా గ‌దుల కేటాయింపు చేస్తోంది. గ‌దులు దొర‌క‌ని భ‌క్తుల‌కు యాత్రికుల వ‌స‌తి స‌ముదాయాల్లో ఉచితంగా లాక‌ర్ వ‌స‌తి క‌ల్పిస్తోంది. మ‌రింత పార‌ద‌ర్శ‌కత పెంచేందుకు అన్ని గ‌దుల కేటాయింపు కౌంట‌ర్లలో స్వైపింగ్ యంత్రాల‌ను అందుబాటులో ఉంచింది. ఈ కార‌ణంగా న‌గ‌దు ర‌హిత లావాదేవీలు బాగా పెరిగాయి.

తిరుమ‌ల‌లో శ్రీ ప‌ద్మావ‌తి విచార‌ణ కార్యాల‌యం, ఎంబిసి, టిబి కౌంట‌ర్‌(కౌస్తుభం), సిఆర్వో కార్యాల‌యంలోని సిఆర్వో జ‌న‌ర‌ల్‌, ఎఆర్‌పి కౌంట‌ర్ల ద్వారా గ‌దుల కేటాయింపు జ‌రుగుతుంది. సిఆర్వో జ‌న‌ర‌ల్ వ‌ద్ద ముందు వ‌చ్చిన వారికి ముందు ప్రాతిప‌దిక‌న సామాన్య యాత్రికుల‌కు గ‌దులు కేటాయిస్తారు. ఇక్కడ ముందుగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది. గ‌ది కేటాయింపు స‌మాచారాన్ని సంబంధిత యాత్రికుల సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలో పంపుతారు. ఆ ఎస్ఎంఎస్‌ను చూపి యాత్రికులు గ‌దులు పొందొచ్చు. అదేవిధంగా, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న‌వారికి, కాటేజి దాత‌ల‌కు ఎఆర్‌పి కౌంట‌ర్‌లో గ‌దులు కేటాయిస్తారు. సిఆర్వో వెనుక వైపు గ‌ల కౌస్తుభం కౌంట‌ర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖ‌ల‌పై గ‌దులిస్తారు. శ్రీ ప‌ద్మావ‌తి విచార‌ణ కార్యాల‌యం, ఎంబిసిలో ప్ర‌ముఖుల‌కు గ‌దులు కేటాయిస్తారు.

ఆన్‌లైన్‌లో 3 నెల‌ల ముందు నుండి గ‌దులు బుక్ చేసుకోవ‌చ్చు. రూ.100/-, రూ.500/-, రూ.600/-, రూ.1000/-, రూ.1500/- అద్దె గ‌దులు ఉంటాయి.

పిఏసిల్లో స‌క‌ల సౌక‌ర్యాలు

తిరుమ‌ల‌లోని ఆర్‌టిసి బ‌స్టాండులో ఇటీవ‌ల అందుబాటులోకి వ‌చ్చిన ప‌ద్మ‌నాభ నిల‌యంతో క‌లిపి మొత్తం 5 యాత్రికుల వ‌స‌తి స‌ముదాయాలున్నాయి. ఇక్క‌డ ఉచితంగా లాక‌ర్లు కేటాయిస్తారు. యాత్రికులు త‌మ వ‌స్తు సామ‌గ్రిని ఇందులో భ‌ద్ర‌ప‌రుచుకుని శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వెళ్లి తిరిగి చేరుకోవ‌చ్చు. విశాల‌మైన హాళ్లలో చ‌క్క‌గా విశ్రాంతి పొందొచ్చు. ఇక్క‌డ జ‌ల‌ప్ర‌సాదం, త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ‌కు మినీ క‌ల్యాణ‌క‌ట్ట‌, మ‌రుగుదొడ్లు, స్నాన‌పుగ‌దులు, అన్న‌ప్ర‌సాదం త‌దిత‌ర అన్ని సౌక‌ర్యాలు ఉన్నాయి. అద్దె గ‌దులు దొర‌క‌నివారు పిఏసిల్లో సౌక‌ర్య‌వంతంగా బ‌స చేయ‌వ‌చ్చు.

 రిసెప్ష‌న్ ప‌రిధిలోని పిఏసి-1, పిఏసి-2, కౌస్తుభం, నంద‌కం, జిఎన్‌సి, ప‌ద్మావ‌తి కౌంట‌ర్‌, ఎస్వీ విశ్రాంతి గృహం, హెచ్‌విసి, స‌ప్త‌గిరి విశ్రాంతి స‌ముదాయాల వ‌ద్ద యాత్రికులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించేందుకు మినీ క‌ల్యాణ‌క‌ట్ట‌లు ఉన్నాయి.

వ‌స‌తి గ‌దులు, పిఏసిల్లో అందుబాటులో కిట్‌లు

తిరుమ‌ల‌లోని అన్ని వ‌స‌తి గ‌దులు, పిఏసిల్లో భ‌క్తుల‌కు కిట్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చాప‌లు, దిండ్లు, దుప్ప‌ట్లు, ఉన్ని కంబ‌ళి ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో బ‌స చేసిన యాత్రికులు అద‌నంగా వీటిని పొందొచ్చు. ఒక రోజుకు 2 చాప‌లకు రూ.10/-, క‌వ‌ర్ల‌తో క‌లిపి  2 దిండ్ల‌కు రూ.10/-, ఒక దుప్ప‌టికి రూ.10/-, ఒక ఉన్ని కంబ‌ళికి రూ.20/- సేవారుసుం వ‌సూలు చేస్తారు. భ‌క్తులు వీటిని బాగా వినియోగించుకుంటున్నారు.

అన్నిచోట్లా స్వైపింగ్ యంత్రాలు

 తిరుమ‌ల‌లో గ‌దులు కేటాయించే శ్రీ ప‌ద్మావ‌తి విచార‌ణ కార్యాల‌యం, ఎంబిసి, టిబి కౌంట‌ర్‌(కౌస్తుభం), సిఆర్వో కార్యాల‌యంలోని సిఆర్వో జ‌న‌ర‌ల్‌ కౌంట‌ర్లలో న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను ప్రోత్స‌హించేందుకు స్వైపింగ్ యంత్రాలు అందుబాటులో ఉంచారు. యాత్రికులు సైతం డెబిట్‌, క్రెడిట్  కార్డుల ద్వారా సులువుగా లావాదేవీలు జరుపుతున్నారు. ఈ కార‌ణంగా చిల్ల‌ర స‌మ‌స్య కూడా తీరిన‌ట్ల‌వుతోంది. ప‌ద్మావ‌తి కౌంట‌ర్‌లో 97 శాతం, ఎంబిసిలో 100 శాతం, టిబి కౌంట‌ర్‌లో 91 శాతం, స‌ప్త‌గిరి విశ్రాంతి గృహాల వ‌ద్ద 62 శాతం, సూరాపురంతోట‌, రాంభ‌గీచా, సిఆర్వో జ‌న‌ర‌ల్ వ‌ద్ద దాదాపు 50 శాతం న‌గ‌దు ర‌హిత లావాదేవీలు జ‌రుగుతున్నాయి.

సామాన్య భ‌క్తుల కోసం 10 క‌ల్యాణ మండ‌పాలు

 సామాన్య భ‌క్తులు వివాహాలు చేసుకునేందుకు వీలుగా వ‌స‌తి క‌ల్ప‌న విభాగం ప‌రిధిలో ఎస్ఎంసి వ‌ద్ద 6, ఎటిసి వ‌ద్ద 1, టిబిసి వ‌ద్ద 3 క‌లిపి మొత్తం 10 క‌ల్యాణ మండ‌పాలున్నాయి. 90 రోజుల ముందు నుండి వీటిని క‌రంట్ బుకింగ్‌లో పొందొచ్చు. ఎస్ఎంసి వ‌ద్ద రూ.200/-, ఎటిసి వ‌ద్ద రూ.500/-, టిబిసి వ‌ద్ద రూ.200/- అద్దె ఉంది. ఇందుకోసం యువ‌తీ యువ‌కుల త‌ల్లిదండ్రులు సిఆర్వోలోని ఆర్వో-1 ఏఈవో గారిని సంప్ర‌దించాల్సి ఉంటుంది. యువ‌తీ యువ‌కుల వ‌య‌సు ధ్రువీక‌ర‌ణప‌త్రం జెరాక్స్ కాపీని స‌మ‌ర్పించాలి. త‌ప్ప‌నిస‌రిగా హిందువులై ఉండాలి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.