TIRUMALA SHRINE IS PINNACLE OF HINDU RELIGION-FORMER KENYAN PM_ తిరుమల శ్రీవారి దర్శనంతో ఆధ్యాత్మిక చైతన్యం : కెన్యా మాజీ ప్రధాన మంత్రివర్యులు గౌ|| శ్రీ రైలా ఓడింగ్
Tirumala, 2 July 2018: The former Prime Minister Sri Raila Odinga described Tirumala temple of Lord Venkateswara as the pinnacle of Hindu civilization.
The foreign dignitary who had darshan on Monday in VIP break said, there are many Hindu temples and other Asian religion shrines in Kenya. The essen ce of all the religious in the world is that the entire mankind emanated from Supreme power, Lord.
I thank the Indian government and temple authorities for providing darshan of Lord Venkateswara. It was a nice experience”, he added.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
తిరుమల శ్రీవారి దర్శనంతో ఆధ్యాత్మిక చైతన్యం : కెన్యా మాజీ ప్రధాన మంత్రివర్యులు గౌ|| శ్రీ రైలా ఓడింగ్
జూలై 02, తిరుమల 2018: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనంతో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందుతుందని కెన్యా మాజీ ప్రధాన మంత్రివర్యులు గౌ|| శ్రీ రైలా ఓడింగ్ కొనియాడారు. గౌ|| మాజీ ప్రధాన మంత్రివర్యులు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం విఐపి బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.
స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కెన్యాలో అనేక హిందూ దేవాలయాలు, అసియాలోని వివిధ మతాలకు చెందిన ప్రార్థన మందిరాలు ఉన్నాట్లు వివరించారు. హిందూమతం ప్రపంచంలోనే పురాతనమైనదని, ఇది ఆధ్యాత్మిక విశ్వాసం, దేవుడిపై నమ్మకంతో రూపొందిందన్నారు.
భారత ప్రభుత్వం, టిటిడి సహకారంతో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.