COMPLETE THE LOCAL TEMPLE REPAIR WORKS WITHIN SCHEDULED TIME_ స్థానికాలయాల్లో ఇంజినీరింగ్‌ పనులను సకాలంలో పూర్తి చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 2 July 2018: TTD EO Sri Anil Kumar Singhal instructed the engineering officials to complete all the pending works pertaining to local temples within stipulated time frame.

The senior officers review meeting was held at the meeting hall in TTD administrative building in Tirupati on Monday. EO reviewed on the progress of various works.The EO said, additional toilets need to be constructed in Mada streets and Narayanagiri Gardens for the need of the pilgrims. The display boards in compartments should give apt information on darshan to pilgrims. All the works related to annual brahmotsavams should complete by August”,he directed.

He instructed the concerned to give wide publicity on Aadhaar or Voter cards for SSD tokens. The pilgrims should be allowed only in their allotted time slot”, he added.

The EO directed the In-charge CVSO Sri Siva Kumar Reddy to inspected the administrative building and set up fire extinguishers wherever necessary. He instructed the DFO to complete the works of greenery in Vontimitta at Kadapa district on a fast pace. Directing the concerned officials, the EO said to improve mike system in Sri Govinda Raja Swamy temple.

Tirumala JEO Sri KS Sreenivasa Raju, FACAO Sri Balaji, CE Sri Chandrasekhar Reddy and other officers were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

స్థానికాలయాల్లో ఇంజినీరింగ్‌ పనులను సకాలంలో పూర్తి చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2018 జూలై 02: టిటిడికి అనుబంధంగా ఉన్న స్థానికాలయాల్లో పెండింగ్‌లో ఉన్న ఇంజినీరింగ్‌ పనులను సకాలంలో పూర్తి చేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం ఉదయం సీనియర్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు నిర్దేశించిన సమయానికి తిరుమలలోని క్యూలైన్లలోకి చేరుకునేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా, సర్వదర్శనం టోకెన్ల కోసం ఆధార్‌ లేదా ఓటరు గుర్తింపుకార్డు తీసుకురావాలని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. తిరుమలలో భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా అదనపు క్యూలైన్లు, మరుగుదొడ్లు ఏర్పాటుచేయాలని సూచించారు. కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు డిస్‌ప్లే బోర్డుల ద్వారా తాజా సమాచారాన్ని తెలియజేయాలన్నారు. నారాయణగిరి ఉద్యానవనాల్లో అదనపు షెడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. సెప్టెంబరులో జరుగనున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆగస్టు చివరినాటికి ఇంజినీరింగ్‌ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

టిటిడి భవనాలను పరిశీలించి అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయాలని ఇన్‌చార్జి సివిఎస్‌వోకు సూచించారు. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయం వద్ద పచ్చదనం పెంపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిఎఫ్‌వోను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో మైక్‌ సిస్టమ్‌ను మరింత మెరుగుపరచాలన్నారు. టిటిడి ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణపనుల్లో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌ నాయుడు, డెప్యూటీ ఈవో శ్రీమతి గౌతమి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.