TIRUMALA TO BE CRIME FREE-SO_ తిరుమలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రత: తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి
Tirumala, 6 Sep. 19: Tirumala Special Officer Sri AV Dharma Reddy advocated that the hill town should be made crime-free.
During the felicitation ceremony organised to the Vigilance sleuths in Common Command Control Centre at Tirumala on Friday, addressing the cops, he said, Tirumala is world capital for Hindu Sanatana Dharma and also made its own mark in sanitation and hygiene. Similarly, it should become a cent percent Crime -Free holy place and to achieve this both the vigilance and police should work with hand in glove”, he observed.
He complimented all the AVSOs, VIs and other security sleuths for their skills and expertise in pilgrim crowd management, handling miscreants, middlemen etc.and also felicitated them.
CVSO Sri Gopinath Jatti, Additional CVSO Sri Sivakumar Reddy, VGOs Sri Manohar, Sri Prabhakar and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రత: తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి
తిరుమల, 2019 సెప్టెంబర్ 06: ప్రపంచప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రతా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని పిఏసి-4లో గల కామన్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శుక్రవారం ఉదయం విధి నిర్వహణలో ప్రత్యేక ప్రతిభ కనపరచిన టిటిడి నిఘా మరియు భద్రతా సిబ్బందికి నగదు బహూమతిని ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రత్యేకాధికారి మాట్లాడుతూ తిరుమలలో భద్రతా మరియు నిఘా వ్యవస్థలు చాల బాగుందన్నారు. తిరుమలను నేర రహిత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్ధేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం తిరుమలలోని అన్ని ప్రాంతాలలోని 564 సిసి టివిలు కామన్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించినట్లు తెలిపారు. తిరుమలలో ఇజ్రాయల్ టెక్నాలజీతో కూడిన భద్రాత వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలను పరిశీలించాలని సివిఎస్వోకు సూచించారు. ఇందులో ఎక్కడ క్రైమ్ జరిగిన వెంటనే దగ్గరలోని మొబైల్ భద్రతా సిబ్బంది ట్యాబ్‌కు మేసేజ్ వెళ్లుతుందని, తద్వార తక్కువ సమయంలో అక్కడకు చేరుకుని నేరాలను అరికట్టవచ్చని వివరించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రత్యేక ప్రతిభ కనపరచిన టిటిడి నిఘా మరియు భద్రతా సిబ్బందిని అభినందించి, నగదు బహుమతిని అందించారు.
అనంతరం సివిఎస్వో శ్రీ గోసినాథ్‌జెట్టి మాట్లాడుతూ తిరుమలలో దర్శనం, వసతి మరియు లడ్డూల దళారులను, దొంగలను పట్టుకోవడం, తప్పిపోయిన వారి ఆచూకీ కనుగొని వారి బంధువులకు అప్పగించుటలో విశేష ప్రతిభ కనపరచిన 5 మంది ఏవిఎస్వోలు, 5 మంది విఐలు, 26 మంది టిటిడి నిఘా మరియు భద్రాత సిబ్బందికి నగదు బహుమతిని అందించినట్లు తెలిపారు. త్వరలో మరిన్ని సిసి కెమెరాలు ఏర్పాటు చేసి కామన్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి మరింత పటిష్ఠంగా భద్రతను పర్యవేక్షిస్తామన్నారు.
అనంతరం ప్రత్యేకాధికారి కామన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును పరిశీలించి, పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్‌వోలు శ్రీ మనోహర్, శ్రీ ప్రబాకర్, ఏవిఎస్వోలు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది