TIRUNAMA DHARANA AND TRADITIONAL DRESS_ స్వచ్ఛందంగా సంప్రదాయ వస్త్రధారణ – తిరునామం పాటిస్తున్న భక్తులు

Vijayawada, 7 July 2017: The PWD grounds in Vijayawada, which is hosting the religious event Sri Venkateswara Vaibhavotsavams set an example of Sanatana Hindu Dharma, with devotees voluntarily taking part in all the rituals in traditional attire wearing Tirunamam.

Tirunamam signifies the white clay found much below the crust of the earth and infact this is used as the powder to wear a flame shaped mark. This namam is applied in such a way that it starts from the point in between the eyebrows and goes up straight till the top edge of the forehead and gives the shape of a flame.

The flame shaped namam signifies the Atman or Atma Jyothi which is nothing but represents the sacred name of the God.

All devotees irrespective of ages, genders have been taking part in these rituals following the Hindu Dharma which remained as a special attraction.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

స్వచ్ఛందంగా సంప్రదాయ వస్త్రధారణ – తిరునామం పాటిస్తున్న భక్తులు

విజయవాడ, 2017,జూలై 07: విజయవాడలో జరుగుతున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు స్వచ్ఛందంగా సంప్రదాయ వస్త్రధారణ, తిరునామం పాటిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వైభవోత్సవాలకు విచ్చేసిన భక్తుల నుదుటన తిరునామం కనువిందు చేస్తోంది. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం కనిపించేలా, భక్తుల హృదయాల్లో శ్రీవారిపై భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంచేందుకు తిరునామం ఎంతగానో దోహదపడుతుంది.

హిందూ సనాతన ధర్మంలో తిలకధారణతోపాటు సంప్రదాయ వస్త్రధారణను తప్పనిసరిగా భక్తులు పాటిస్తారు. మహిళలు చీరలు, పురుషులు పంచ, కండువా లేదా కుర్తా పైజామా ధరిస్తున్నారు.

శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో స్థానిక సేవకులు క్యూలైన్ల క్రమబద్ధీకరణ, అన్నప్రసాద వితరణతోపాటు తిరునామధారణ సేవలు అందిస్తున్నారు.

శ్రీవారి తిరునామం :

శ్రీవారి మూలమూర్తికి శుక్రవారం అభిషేకం తరువాత వారానికి ఒకసారి మాత్రమే చందనం పొడి, కర్పూరం, మధ్యలో కస్తూరితో తిరునామం దిద్దుతారు. గురువారం సడలింపు(ఆభరణాలు తొలగించే) సమయంలో కళ్లు కనిపించేలా తిరునామాన్ని కొంతమేర తగ్గిస్తారు. పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ తిరునామం శ్రీవారి ముఖారవిందాన్ని మరింత తేజస్సుతో ఆవిష్కరిస్తుంటుంది. ఈ నామాన్ని తిరుమణికాప్పు అని అంటారు. ఇందుకుగాను 16 తులాల పచ్చ కర్పూరం, ఒకటిన్నర తులం కస్తూరిని ఉపయోగిస్తారు.

తిరునామంలో ఎర్రటికాంతిలా కనిపించే ఆకారం ఆత్మను సూచిస్తుంది. కొంత మంది భక్తులు భుజాలు, ఛాతీపైన, వీపుపై కింది భాగాన తిరునామం ధరిస్తారు. తిరునామం అంటే స్వామివారి పవిత్రనామం అని అర్థం. భూమిలోపల తెల్లటి పొరల్లో లభించే పొడి ద్వారా దీనిని తయారుచేస్తారు. భక్తులు కనుబొమల మధ్య నుంచి నుదుటిపై వరకు ధరిస్తారు. తిరునామం ధరించినవారు శ్రీవేంకటేశ్వరుని సేవకులని సులువుగా గుర్తించవచ్చు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.