TIRUPATI JEO INSPECTS KANYAKUMARI SITE _ కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ నిర్మాణ స్థలం పరిశీలన

KANYAKUMARI, APRIL 19:  The Tirumala Tirupati Devasthanams (TTDs) Joint EO of Tirupati Sri P Venkatrami Reddy on Friday inspected the five-acre site allotted to TTD towards the construction of Sri vari temple at Kanyakumari.
 
During this occasion, he has instructed the engineering offcials to take up the construction of the temple work on a fast pace. Later he also met and discussed with the Nagarcoil district collector Sri Nagarajan about the construction work and sought his intervention to speed up the work.
Meanwhile, TTD will be construction Lord Venkateswara Swamy temple in the massive site donated by the donors. Apart from the temple, plans have already been designed to construct a Dhyan Mandir, Annaprasada satram, goshala, potu, kalyana mandapam and vahana mandapam in this area.
Later, the JEO also visited TTD publication stall in Vivekananda Rock Memorial and expressed his pleasure over the sales of TTD publications.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
 
 

కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ నిర్మాణ స్థలం పరిశీలన

తిరుపతి, ఏప్రిల్‌ 19, 2013: తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ ధార్మికక్షేత్రమైన కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి దాతలు కేటాయించిన ఐదు ఎకరాల స్థలాన్ని శుక్రవారం తితిదే తిరుపతి సంయుక్త  కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన తితిదే ఇంజినీరింగ్‌ అధికారులతో మాట్లాడుతూ త్వరితగతిన ఆలయ నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు  సంప్రదింపులు జరిపి వీలైనంత తొందరగా ఆలయ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. అనంతరం ఆయన నాగర్‌కోయిల్‌ జిల్లా కలెక్టర్‌ శ్రీ నాగరాజన్‌తో చర్చించి శ్రీవారి ఆలయ నిర్మాణం త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
కాగా కన్యాకుమారిలోని ఐదు ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయంతోపాటు  ధ్యానమందిరం, గోశాల, పుష్కరిణి, వాహన మండపం, వేదపాఠశాల, అన్నప్రసాద కేంద్రం, కల్యాణమండపం, పోటు లాంటి ఇతర వసతులు కూడా తితిదే కల్పించనుంది. ఈ ఆలయాన్ని భక్తుల సందర్శనీయ క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు తితిదే చర్యలు చేపడుతోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.