TIRUPATI TOWN REVERBERATES TO “HARA HARA MAHADEVA SAMBHO SHANKARA” CHANTINGS_ శ్రీకపిలేశ్వరాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

TTD OBSERVES MAHA SIVARATRI WITH RELIGIOUS FERVOUR IN KAPILA TEERTHAM

LORD RIDES NANDI VAHANAM

Tirupati, 13 February 2018: The temple city of Tirupati echoed to the rhythmic chants of “Hara Hara Mahadeva Sambho Shankara” on Tuesday.

TTD made elaborate security arrangements to man the heavy influx of devotees in the famous temple of Kapileswara Swamy in Tirupati.

Special cultural programmes have been organised by TTD in connection with the auspicious occasion.

RUDRABHISHEKAM PERFORMED

The hectic day started with the temple opening doors for darshan at 2.30am on Tuesday. Mahanyasapurvaka Ekadasa Rudrabhishekam was performed on the occasion. Serpentine lines were order of the day as devotees lined up for
darshan.

NANDIVAHANA SEVA

On Tuesday evening Nandi Vahana Seva was performed between 6pm and 10pm.

TTD EO Sri Anil Kumar Singhal, CVSO Sri A Ravikrishna, DyEO Sri Subramanyam, AEO Sri Sankara Raju, Chief Priest Sri Manuswami, AVSO Sri Gangaraju, Supdt Sri Rajkumar, Temple inspectors Sri Narayana and Sri C Murali krishna particiated in the event.

LINGODBHAVA DARSHAN

On the other hand Lingodbhava Abhishekam will be observed in 00:00hrs of February 14 till 4am in the temple.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీకపిలేశ్వరాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

ఫిబ్రవరి 13, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దసంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. టిటిడి విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు.

మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటల నుండి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు రథోత్సవం(భోగితేరు) జరిగింది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం చేపట్టారు.

నంది వాహనసేవ:

మంగళవారం సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు విశేషమైన నంది వాహనసేవ వైభవంగా జరిగింది. మహావిష్ణువుకు గరుడ వాహనం ఎంత ప్రీతికరమైనదో పరమేశ్వరునికి నంది వాహనం అంత విశిష్టమైనది. నందీశ్వరునిపై విహరించే పరమేశ్వరుడిని దర్శిస్తే శాంతస్వభావం, దివ్యజ్ఞానం చేకూరుతాయి.

లింగోద్భవ అభిషేకం :

ఫిబ్రవరి 14వ తేదీన తెల్లవారుజామున 12.00 నుండి ఉదయం 4.00 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహిస్తారు. ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. ఈ అభిషేకంలో పాల్గొన్న భక్తులకు పునర్జన్మ ఉండదు. సర్వరోగాలు నయమవుతాయి.

విశేషంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు

మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 6 నుండి 7 గంటల వరకు ఎస్‌.వి.సంగీత కళాశాల వారిచే మంగళధ్వని, ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు శివం పురాణ ప్రవచనం, మధ్యాహ్నం 11 నుంచి 1 గంట వరకు ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులతో శివోహం భజన కార్యక్రమం, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు శివానందలహరి భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

అదేవిధంగా సాయంత్రం 6.30 నుంచి 9.30 గంటల వరకు పౌరాణిక నాటకం, రాత్రి 9.30 నుంచి 11.30 గంటల వరకు హరికథ, రాత్రి 11.30 నుంచి బుధవారం తెల్లవారుజామున 1 గంట వరకు తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు కలిసి నమకం, చమకం, రుద్రం, శ్రీసూక్తం, పురుషసూక్తం పారాయణం చేస్తారు. తెల్లవారుజామున 1 గంట నుంచి 2.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శివ సంకీర్తనలు, ఉదయం 2.30 నుంచి 4.30 గంటల వరకు హరికథ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమాల్లో టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ , సివిఎస్వో శ్రీ ఆకే రవికృష్ణ, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి , విజివో శ్రీ అశోక్ కుమార్ గౌడ్ , టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ శంకరరాజు, ప్రధానార్చకులు శ్రీ మణిస్వామి, ఎవిఎస్వోలు శ్రీ గంగరాజు , పార్థసారథి రెడ్డి , సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నారాయణ, శ్రీసి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.