TTD VASTRAMS TO VEMULAVADA TEMPLE_ వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామికి పట్టు వస్త్రాలు సమర్పణ
Tirumala, 13 February 2018: On the auspicious occasion of Maha Sivaratri, silk vatrams have been presented to Sri Raja Rajeswara Swamy of Vemulavada in Sirisilla district of Telengana.
Tirumala JEO Sri KS Sreenivasa Raju presented the silk vastrams on behalf of TTD. Speaking on this occasion the JEO said, it is a customary to offer silk vastrams to the presiding deity on behalf of Tirumala temple during every year sivarathri.
Later he offered laddu prasadams to Endowments Minister of Telengana Sri Indrakaran Reddy.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామికి పట్టు వస్త్రాలు సమర్పణ
ఫిబ్రవరి 13, తిరుమల 2018: తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామికి టిటిడి తిరుమల జెఈఓ శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు మంగళవారం పట్టువస్త్రాలు సమర్పించారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న జెఈఓ శ్రీ కెఎస్.శ్రీనివాసరాజుకు ఆలయాధికారులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. ఆలయ ఈఓ శ్రీ రాజేశ్వర్ పట్టువస్త్రాలు స్వీకరించి స్వామివారికి సమర్పించారు. అనంతరం జెఈఓకు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడి రాజరాజేశ్వరస్వామివారికి ప్రతి ఏటా టిటిడి తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. భక్తులందరిపై స్వామివారి ఆశీస్సులుండాలని ఆకాంక్షించారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి,ఆయన సతీమణి శ్రీమతి అల్లోల విజయ లక్ష్మికి తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని టిటిడి జేఈవో శ్రీ శ్రీనివాసరాజు అందించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ బొక్కసం బాధ్యులు శ్రీ గురురాజారావు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.