డిసెంబరు 16 నుండి అన్నమాచార్య కళామందిరంలో ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
డిసెంబరు 16 నుండి అన్నమాచార్య కళామందిరంలో ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు
తిరుపతి, 16 డిసెంబరు 2017: పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం శనివారం సాయంత్రం 6.00 గంటలకు జరగనుంది. టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో డిసెంబర్ 16 నుండి 2018, జనవరి 14వ తేదీ వరకు నెల రోజులపాటు దేశవ్యాప్తంగా గల 195 ప్రముఖ ఆలయాల్లో తిరుప్పావై ప్రవచనాలు, ప్రముఖ పండితులతో ధార్మికోపన్యాసాలు వినిపించనున్నారు. ధనుర్మాసం సందర్భంగా ఈకార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ.
ఇందులో భాగంగా తిరుమల ఆస్థానమండపంలో శ్రీ సముద్రాల రంగనాథన్, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల ఆస్థానమండపంలో శ్రీ వి.వరదరాజన్, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ చక్రవర్తి రంగనాథన్, కెటి రోడ్డులోని శ్రీవరదరాజస్వామివారి ఆలయంలో శ్రీ కె.రాజగోపాలన్ తిరుప్పావై పారాయణం చేయనున్నారు.
అదేవిధంగా టిటిడి రామ్‌నగర్ క్వార్టర్స్‌లోని గీతామందిరంలో శ్రీ రంగరాజన్, శ్రీపురం కాలనీలోని శ్రీ మలయాళ సద్గురు సేవా సమాజంలో శ్రీ ఎమ్.ప్రభాకర్‌రావు, భైరాగిపట్టెడలోని శ్రీ భక్తాంజనేయస్వామివారి దేవస్థానంలో శ్రీ దేవరాజన్, తుమ్మలగుంటలోని శ్రీవేంకటేశ్వరాలయంలో శ్రీమతి స్వర్ణ అన్నపూర్ణ, చంద్రగిరి రోడ్డులోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ట్రస్టులో శ్రీ పవన్ కుమారాచార్యులు ప్రతిరోజూ ఉదయం 7.00 నుంచి 8.00 గంటల వరకు తిరుప్పావై ప్రవచనాలు వినిపిస్తారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ధనుర్మాసంలో తిరుప్పావై ప్రవచనాలు విని తరించాలని కోరడమైనది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.