TIRUVADIPPUDI UTSAVAM COMMENCES IN SRI GT_ ఘనంగా ప్రారంభమైన ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం

Tirupati, 17 July, 2017: Sri Andal Tiruvadippudi Utsavam commenced in Sri Govindaraja Swamy temple Tirupati on Monday in a religious manner. This ten day festival will conclude on July 26.

The significance of this festival is that Andal Sri Godai was born in the auspicious day on the advent of Uttara Phalguni star in Adi month in Srivilliputtur in Tamilnadu, which is considered most sacred and important for Srivaishnavaites.

In the famous and ancient shrine of Sri Govindaraja Swamy, this festival is being observed from the past several centuries in such a way, the ten day fete concludes on Uttara Phalguni Star. Since this festival takes place in the month of Adi, it is called “Tiruvadippudi Utsavam”. Every day Tirumanjanam will be performed to Andal between 6am and 6:30am followed by celestial procession in mada steets between 5:30pm and 6:30pm.

Meanwhile the other prominent days during this fete includes, Rohini Asthanam on July 20, Sukravara Asthanam on July 21, Snapana Tirumanjanam to Sri Govindaraja Swamy and Andal in connection with the final day fete on July 26 will be observed.

CHAKRATTALWAR SATTUMORA ON JULY 23

Another important fete which is being observed in the temple of Sri Govindaraja Swamy with utmost religious fervour is “Chakrattalwar Sattumora” which falls on July 23 this year. Sri Prativadi Bhayankara Annan Sattumora will also be observed on the same day.

The importance of this fete is that the sacred disc weapon of Lord Maha Vishnu-the Sudarshana Chakrattalwar was consecrated in Sri Govindaraja Swamy temple in the auspicious day coinciding with star Pushyami in the first Gopuram of the temple . Following the significance of the day, the Lord Sri Govindaraja Swamy flanked by his two consorts along with Chakrattalwar take celestial procession. The procession of Andal Godai will also be observed afterwards.

Sri Prativadi Bhayankara Annan is a great Sri Vaishnava Acharya who penned the famous “Suprabhatam” and also commentaries for Sri Bhashyam, Sri Bhagavatam etc. Following his birth on this auspicious day in Pushyami Star of Adi month, Sattumora is observed. Sri Varadaraja Swamy and Sri Prativadi Bhayankara Annan utsava murties will be taken on a celestial procession on this day.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఘనంగా ప్రారంభమైన ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం

తిరుపతి, 2017 జూలై 17: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 5.00 గంటలకు అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి, భక్తులకు విశ్వరూప దర్శనం కల్పించారు. అనంతరం ఉదయం 6.00 నుండి 6.30 గంటల వరకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి తిరుమంజనం వైభవంగా నిర్వహించారు.

ఈ ఉత్సవాన్ని జూలై 26వ తేదీ వరకు ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాంగా ప్రతి రోజు ఉదయం 6.00 నుండి 6.30 గంటల వరకు అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

జూలై 20వ తేదీ రోహిణి ఆస్థానం, జూలై 21వ తేదీ శుక్రవారం ఆస్థానం నిర్వహిస్తారు. జూలై 26వ తేదీన ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని అలిపిరికి తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు. ప్రత్యేకపూజల అనంతరం అలిపిరి నుండి గీతామందిరం, రామనగర్‌ క్వార్టర్స్‌, వైఖానసాచార్యుల వారి ఆలయం, ఆర్‌ఎస్‌ మాడ వీధి, చిన్నజీయర్‌ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంటుంది.

ప్రాశస్త్యం :

శ్రీ గోదాదేవి అమ్మవారు శ్రీవిల్లిపుత్తూరులో ఆషాడమాసం( ఆడినెల)లో పరమ పవిత్రమైన పూర్వ ఫల్గుణి నక్షత్రం రోజున అవతరించారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఈ పవిత్ర రోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు తిరువడిపురం ఉత్సవం వైభవంగా నిర్వహిస్తారు. ఫల్గుణి నక్షత్రానికి 10 రోజుల ముందు నుండి ఆలయంలో ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితి.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ ప్రసాదమూర్తిరాజు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

జూలై 23న శ్రీ చక్రత్తాళ్వార్‌ సాత్తుమొర

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 23వ తేదీ ఆదివారం శ్రీచక్రత్తాళ్వార్‌ సాత్తుమొర, శ్రీప్రతివాది భయంకర అన్నన్‌ సాత్తుమొర ఘనంగా జరుగనున్నాయి. శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం ఉత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయం నుంచి ఉదయం 8.00 నుంచి 9.30 గంటల వరకు ఉభయనాంచారులతో కూడిన శ్రీ వరదరాజస్వామివారిని, శ్రీ ప్రతివాది భయంకర అన్నన్‌ను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు తిరుమల నుంచి వచ్చిన శ్రీవారి అప్పపడి ప్రసాదాన్ని శ్రీకోదండరామాలయం నుంచి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొస్తారు.

సాయంత్రం 4.00 నుండి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని, శ్రీ చక్రత్తాళ్వార్‌ను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆండాళ్‌ అమ్మవారి ఊరేగింపు ఉంటుంది.

పాశస్త్యం :

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని మొదటి గోపురంలో పవిత్రమైన పుష్యమి నక్షత్రం రోజున శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను ప్రతిష్ఠించారు. స్వామివారి ప్రతిష్టాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ చక్రత్తాళ్వార్‌ సాత్తుమొరను జూలై 23వ తేదీ నిర్వహించనున్నారు.

శ్రీ ప్రతివాది భయంకర అన్నన్‌ కాంచిపురంలో జన్మించారు. ఆయన సంస్కృత పండితులు, శ్రీవైష్ణవాచార్యులు. తిరుమల శ్రీవారిని మేల్కొలిపే సుప్రభాతాన్ని, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనమును అద్భుతంగా రచించారు. అంతేగాక శ్రీ భాష్యం, శ్రీ భాగవతం వంటి మహా గ్రంథాలకు వ్యాఖ్యానం రచించారు. వీరి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆరోజున సాత్తుమొర నిర్వహించడం ఆనవాయితి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.