TN CM OFFERS PRAYERS_ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి పళనిస్వామి

Tirumala, 25 September 2018: The Honourable CM of Tamil Nadu Sri E Palani Samy offered prayers in the hill shrine of Lord Venkateswara on Tuesday.

The CM of neighbouring state took part in Astadalapada Padmaradhana Seva of Lord Venkateswara.

Earlier on his arrival, he was welcomed by TTD EO Sri Anil Kumar Singhal.

Later he was offered Vedasirvachanam in Ranganayakula Mandapam by vedic pandits. The TTD EO offered him Theertha Prasadams and lamination photo of Lord Venkateswara.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి పళనిస్వామి

తిరుమల, 2018 సెప్టెంబరు 25: తమిళనాడు ముఖ్యమంత్రి గౌ|| శ్రీ ఎడప్పాడి పళనిస్వామి మంగళవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| ముఖ్యమంత్రికి టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

అష్టదళపాదపద్మారాధన సేవలో గౌ|| ముఖ్యమంత్రి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యోగనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని గౌ|| ముఖ్యమంత్రికి అందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.