TN CM OFFERS PRAYERS _ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి పళనిస్వామి

Tirumala, 15 May 2018: The Honourable CM of Tamil Nadu Sri E Palani Sami offered prayers in the hill shrine of Lord Venkateswara on Tuesday.

The CM of neighbouring state took part in Astadalapada Padmaradhana Seva of Lord Venkateswara.

Earlier on his arrival, he was welcomed by TTD EO Sri Anil Kumar Singhal and Tirumala JEO Sri KS Sreenivasa Raju.

Later he was offered Vedasirvachanam in Ranganayakula Mandapam by vedic pandits. The TTD officials offered him Theertha Prasadams and lamination photo of Lord Venkateswara.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి పళనిస్వామి

తిరుమల 15 మే 2018 ; కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి పళనిస్వామి మంగళవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా ఆలయంలోకి చేరుకున్న గౌ|| ముఖ్యమంత్రి శ్రీ పళనిస్వామికి టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు స్వాగతం పలికారు.

ముందుగా అష్టదళపాదపద్మారాధన సేవలో గౌ|| ముఖ్యమంత్రి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ వకుళమాతను, ఆలయ ప్రదక్ష్షిణగా వచ్చి విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యోగనరసింహస్వామివారిని దర్శించుకుని హుండిలో కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి పళనిస్వామికి పండితులు వేదాశీర్వచనం చేశారు. అటుతర్వాత తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌ శ్రీనివాసరాజు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి విఎస్‌వోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మీ, ఎవిఎస్‌వో శ్రీ కూర్మారావు, శ్రీ చిరంజీవి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.