TO BE SWORN IN CHAIRMAN OF TTD LAUDS HIS PREDECESSOR’S CONTRIBUTIONS _ శ్రీ వైవి.సుబ్బారెడ్డి సేవ‌లు అనుస‌ర‌ణీయం – తిరుప‌తి శాస‌న‌స‌భ్యులు, టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి

TIRUMALA, 07 AUGUST 2023: To be sworn in TTD Trust Board Chairman and Tirupati Legislator Sri Bhumana Karunakar Reddy has lauded the impeccable and selfless services of his predecessor Sri YV Subba Reddy during his four-year long tenure as the TTD Board Chief.

Passing a resolution during the last meeting of the present TTD Board held at Annamaiah Bhavan in Tirumala on Monday Sri Karunakar Reddy poured in laurels on Sri Subba Reddy and said the style in which he executed his portfolio in the last four years with finesse is a role model to his successors. “With complete dedication and devotion, Sri Subba Reddy has brought in revolutionary changes keeping in view the larger interests of the pilgrims. The way in which he discharged his duties and responsibilities as TTD Chairman were praiseworthy and definitely an inspiration to his successors”, he reiterated.

Later the TTD Board members and officials also congratulated the contributions of Sri YV Subba Reddy.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ వైవి.సుబ్బారెడ్డి సేవ‌లు అనుస‌ర‌ణీయం – తిరుప‌తి శాస‌న‌స‌భ్యులు, టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి

తిరుమ‌ల‌, 2023 ఆగస్టు 07: టీటీడీ ఛైర్మ‌న్‌గా శ్రీ వైవి.సుబ్బారెడ్డి నాలుగేళ్ల పాటు అందించిన సేవ‌లు అనుస‌ర‌ణీయమ‌ని తిరుప‌తి శాస‌న‌స‌భ్యులు, టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి కొనియాడారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో సోమ‌వారం జ‌రిగిన ధ‌ర్మ‌క‌ర్తల మండ‌లి స‌మావేశంలో ఈ మేర‌కు ఆయ‌న తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీ వైవి.సుబ్బారెడ్డి త‌న ప‌ద‌వీకాలంలో సామాన్య భ‌క్తుల‌కు మెరుగైన వ‌స‌తులు క‌ల్పించ‌డానికి, దేవ‌స్థానం అభివృద్ధికి ఎంతో కృషి చేశార‌ని ప్ర‌శంసించారు.

వివాద‌ర‌హితుడు, సౌమ్యుడు అయిన శ్రీ వైవి.సుబ్బారెడ్డి నుంచి తాము చాలా నేర్చుకున్నామ‌ని చెప్పారు. బోర్డు స‌భ్యులంతా శ్రీ వైవి.సుబ్బారెడ్డి సేవ‌ల‌ను కొనియాడారు. అనంత‌రం శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి శాలువ‌తో శ్రీ వైవి.సుబ్బారెడ్డిని స‌న్మానించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.