“TODAY IS A MEMORABLE DAY IN MY LIFE”-TN GUV _ “ఈ రోజు నా జీవితంలో ఒక మధుర‌మైన‌ రోజు”‌ భ‌క్తుల‌కు టిటిడి అందిస్తున్న సౌక‌ర్యాలు భేష్ – త‌మిళ‌నాడు గవర్నర్‌ గౌ|| శ్రీ బన్వారిలాల్ పురోహిత్‌

LAUDS TTD ARRANGEMENTS OF DARSHAN TO DEVOTEES AND VEDIC PROGRAMMES

Tirumala, 18 Sep. 20: Lauding the efforts of the management of Tirumala Tirupati Devasthanams in making wonderful darshan arrangements to the pilgrims following all COVID guidelines, the first citizen of Tamilnadu, His Excellency Sri Bhanwarilal Purohit expressed that this visit to Tirumala will remain as a memorable day in his life. 

The Tamilnadu Governor had darshan of Lord Venkateswara along with his entourage on Friday. After darshan of Lord Venkateswara, he was rendered Vedasirvachanam by the Vedic pundits at Addala Mandapam. The Additional EO of TTD Sri AV Dharma Reddy presented him with the Prasadam of Lord Venkateswara.

Later speaking on this occasion, the Governor expressed that he visited many places of worship but the cleanliness that is being followed in Tirumala in spite of visits by thousands of pilgrims every day shows the commitment and dedication of the strong workforce of TTD. “The darshan with social distancing and other norms for pilgrims is well executed by the management”, he reiterated.

On participating in Sundarakanda Pathanam at Nada Neerajana Mandapam, he said, “I am a devotee of Lord Hanuman and I recited Hanuman Chalisa every day. We used to recite Sundarakanda also on occasions. I feel it as a privilege to have taken part in Sundarakanda Pathan at Tirumala and that too on its 100th day. I whole-heartedly compliment the management for taking up such spiritual activities for the well-being of humanity during the COVID crisis which is in the true spirit of our Sanatana Dharma”, he maintained.

CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Harindranath, Reception DyEO Sri Balaji were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

“ఈ రోజు నా జీవితంలో ఒక మధుర‌మైన‌ రోజు”‌

భ‌క్తుల‌కు టిటిడి అందిస్తున్న సౌక‌ర్యాలు భేష్ – త‌మిళ‌నాడు గవర్నర్‌ గౌ|| శ్రీ బన్వారిలాల్ పురోహిత్‌

తిరుమల, 2020 సెప్టెంబ‌రు 18: ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం నెల‌కొన్న క‌రోనా ప‌రిస్థితుల‌లో టిటిడి యాజ‌మాన్యం కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు చేసిన ద‌ర్శ‌న ఏర్పాట్ల‌ను త‌మిళ‌నాడు గవర్నర్‌ గౌ|| శ్రీ బన్వారిలాల్ పురోహిత్‌
కొనియాడారు. తిరుమల శ్రీవారిని శుక్ర‌‌వారం ఉద‌యం బ్రేక్ ద‌ర్శ‌నంలో త‌మిళ‌నాడు గవర్నర్‌ దర్శించుకున్నారు.

అనంత‌రం అద్ధాల‌ మండపంలో  వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అద‌న‌పు ఈవో తీర్థప్రసాదాలు అందించారు.

ఈ సందర్భంగా గౌ|| గవర్నర్‌ మాట్లాడుతూ ప్ర‌తి మ‌నిషికి జీవితంలో మ‌హ‌త్త‌రమైన రోజు ఉంటుంద‌ని, ఈ రోజు త‌న జీవితంలో మ‌ర‌పురాని రోజ‌న్నారు. తాను దేశ వ్యా‌ప్తంగా అనేక ఆల‌యాల‌ను సందర్శించానని, అయితే ప్రతిరోజూ వేలాది మంది భ‌క్తులు తిరుమలను సందర్శించినప్పటికీ  ఇక్క‌డ అనుసరిస్తున్న పరిశుభ్రత,  పర్యావరణం చక్కగా ఉన్నాయని ఇందుకోసం కృషి చేస్తున్న టిటిడి అధికారులు, సిబ్బంది నిబద్ధత మరియు అంకితభావాన్ని కొనియాడారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు “భ‌క్తులకు భౌతిక దూరం మరియు ఇతర నిబంధనలతో దర్శనం, నిర్వహణ  చాలా బాగా అమలు చేయబడుతుంది” అని ఆయన అభినందించారు.

నాద‌నీరాజ‌నం వేధిక‌పై సుందరకాండ పఠనంలో పాల్గొన్న ఆయన త‌న అనుభూతిని తెలుపుతూ  “నేను హనుమంతుని భక్తుడ‌ను, ప్రతిరోజూ హనుమాన్ చలీసాను పఠిస్తాము, సుందరకాండను కూడా చాలా సందర్భాలలో పఠించిన‌ట్లు తెలిపారు. మన హిందూ సనాతన ధర్మం, భార‌త‌దేశ సంస్కృతిని అద్భుతంగా భ‌క్తుల‌కు చేర‌వేస్తున్న సుంద‌ర‌కాండ పఠ‌నం 100వ‌ రోజు పాల్గొనడం ఒక విశేషంగా భావిస్తున్నామన్నారు. కోవిడ్ సంక్షోభ‌ సమయంలో లోక క‌ల్యాణార్థం ఇటువంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలను చేపట్టి, నిర్వ‌హిస్తున్న‌టిటిడిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను”అని ఆయ‌న అన్నారు.‌

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, రిసెప్ష‌న్ డెప్యూటీ ఈవో శ్రీ బాలాజి పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.