TRADITIONAL BUDGET FETE HELD IN SRIVARI TEMPLE _ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం

Tirumala, 17 July 2022:  The annual budget fete of Anivara Asthanam was held with religious fervour in Srivari temple on Sunday.

Speaking on the occasion, the TTD EO Sri AV Dharma Reddy said ”Traditionally this festival is observed on the day when Sun God enters Dakshinayana in Karkataka Rasi. It was on this day when Mahants (past managers of Srivari temple) submitted the expenses, assets and stocks list. But ever since the TTD took over the reins of Tirumala temple Administration, the same functions have been shifted March-April.

But the fete is observed symbolically at the end of Ani Masam, the last day as per Tamil Calendar in the month of Ani.

Earlier during the day the utsava idols of Sri Malayappa and His consorts were seated on Sarvabhoopala Vahanam at Bangaru Vakili along with Sri Viswaksena and special pujas including Roopayi Harati, Prasadam and Kainkaryams were performed for them and also to the Mula Virat simultaneously.

JEEYARSWAMY PRESENT VASTRAM

Tirumala pontiff Sri Sri Sri Pedda Jeeyarswamy presented six big pattu vastrams on a silver platter over his head to Srivari temple of which he presented four vastrams to Mula Virat and two to utsava idols of Sri Malayappa and Sri Viswaksena.

Thereafter chief archaka dressed in pattu vastram for the occasion bless the Tirumala pontiffs and TTD EO by symbolically handing over the temple keys after getting the permission and blessings of Srivaru.

In view of Anivara Asthanam, TTD has cancelled the Arjita sevas including Kalyanotsavam, Unjal Seva, Sahasra Deepalankara seva on Sunday.

Board member Sri Nanda Kumar, LAC Chennai Chief Sri Sekhar Reddy, CVSO Sri Narasimha Kishore, DyEO Sri Ramesh Babu, SE 2 Sri Jagadeeshwar Reddy and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం

– వార్షిక లెక్కలు ప్రారంభించిన రోజు : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమల, 17 జులై 2022: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం నాడు సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తార‌ని చెప్పారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వ‌చ్చింద‌న్నారు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టిటిడి వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవ‌ని తెలిపారు. టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్‌ నెలలకు మార్చిన‌ట్టు వివ‌రించారు. సాయంత్రం 6 గంటలకు పుష్ప‌ప‌ల్ల‌కీపై స్వామి, అమ్మ‌వారు నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తార‌ని తెలిపారు.

ముందుగా ఉదయం బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు.

అనంతరం శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఈవో ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు. నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు.

తదనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో ”పరివట్టం”(చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి  ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తరువాత అర్చకులు శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగారికి, టిటిడి తరఫున కార్యనిర్వహణాధికారి శ్రీ ఎవి.ధర్మారెడ్డి గారికి ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాలచెంత ఉంచ‌డంతో ఆణివార ఆస్థానం ముగిసింది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.