SRIRANGAM SARE OFFERED TO SRIVARU _ శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ
TIRUMALA, 17 JULY 2022: As a traditional practice, Sare was offered to Tirumala temple from Sri Rangam temple of Tamilnadu.
On behalf of Tamilnadu Government, the Honourable Endowments Minister Sri Sekhar Babu, Endowments Secretary Sri Chandra Mohan and Endowments Commissioner Sri Kumara Guruvaran have presented the silks in a procession from Tirumala Pedda Jeeyar Mutt to Srivari temple.
Both the Senior and Junior Pontiffs of Tirumala, TTD EO Sri AV Dharma Reddy, Board member Sri Nanda Kumar, LAC Chief Sri Sekhar Reddy, CVSO Sri Narasimha Kishore, temple DyEO Sri Ramesh Babu and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ
తిరుమల, 17 జులై 2022: ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగనాథస్వామివారి ఆలయ అధికారులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఉదయం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మఠం నుండి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శ్రీ శేఖర్‌బాబు, దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీ చంద్రమోహన్, కమిషనర్ శ్రీ కుమరగురువరన్, టిటిడి బోర్డు సభ్యుడు శ్రీ నందకుమార్, చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు శ్రీ శేఖర్ రెడ్డి, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, విజిఓ శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీహరి, పార్ పత్తేదార్ శ్రీ తులసీప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.