TRAINING ON CARDIO PULMONARY RESUSCITATION(CPR) HELD FOR TTD EMPLOYEES_ టిటిడి ఉద్యోగులకు గుండెనొప్పి ప్రథమ చికిత్సపై అవగాహన

Tirupati, 18 January 2018: The three-day community training programme on Cardio Pulmonary Resuscitation (CPR) by SVIMS for employees of TTD commenced in TTD administrative building in Tirupati on Thursday.

This training programme has been initiated by SVIMS Director Dr T Ravi Kumar under the instructions of TTD EO Sri Anil Kumar Singhal.

Dr P Hemalatha, Associate Professor , Department of Anaesthesiology imparted training to the employees on first day in Meeting hall and conference hall of IT Department. She explained that CPR is a lifesaving technique useful in many emergencies, including heart attack.

This training was held from 11:15am till 4:15pm on first day in different phases covering many departments on first day. This training programme will continue for two more days up to January 20.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

టిటిడి ఉద్యోగులకు గుండెనొప్పి ప్రథమ చికిత్సపై అవగాహన

తిరుపతి, 2018 జనవరి 18: టిటిడి ఉద్యోగులకు గుండెనొప్పి ప్రథమ చికిత్సపై గురువారం స్విమ్స్‌ వైద్యులు అవగాహన కల్పించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు స్విమ్స్‌ డైరెక్టర్‌ డా|| టి.రవికుమార్‌ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.

స్విమ్స్‌ అనస్థీషియాలజి అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా|| పి.హేమలత మాట్లాడుతూ ఎవరైనా గుండెనొప్పితో బాధపడుతున్నట్టు గుర్తిస్తే వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించాలని, ఇంతలోపు ప్రథమ చికిత్స చేయాలని సూచించారు. ఈ ప్రథమ చికిత్సను సిపిఆర్‌(కార్డియో పల్మనరీ రెసిస్టేషన్‌)గా పిలుస్తారని తెలిపారు. ముందుగా, గుండెనొప్పి వచ్చినవారి నాడి, శ్వాసను పరిశీలించాలన్నారు. 5 సెకన్ల నుంచి 10 సెకన్ల లోపు 30 సార్లు ఛాతిపై మర్దన చేయాలని, నోటి ద్వారా శ్వాసను అందించాలని, ఈ రెండు పనులు క్రమబద్ధంగా చేయాలని చెప్పారు. అంబులెన్స్‌ వచ్చేలోపు 5 సార్లు ఈ ప్రక్రియను చేపట్టాలన్నారు. ప్రథమ చికిత్స చేయడం వల్ల కోమాలోకి వెళ్లకుండా కాపాడవచ్చన్నారు.

టిటిడి పరిపాలన భవనంలో మూడు రోజుల పాటు ఈ అవగాహన కార్యక్రమం జరుగనుంది. స్మార్ట్‌ సిటి క్యాంపెయిన్‌లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్టు స్విమ్స్‌ వైద్యులు తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.