ANNUAL BRAHMOTSAVAMS IN SKVST FROM FEB 6-14_ ఫిబ్రవరి 6 నుండి 14వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 18 January 2018: The annual brahmotsavams in Sri Kalyana Venkateswara Swamy is scheduled from February 6 to 14 with Ankurarpanam on February 5.

The important days includes Dhwajarohanam on February 6, Garuda Seva on February 10, Swarna Ratham on February 11, Rathotsavam on February 13and Chakrasnanam on February 14.

TTD has cancelled arjitha sevas in the temple during this period.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఫిబ్రవరి 6 నుండి 14వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2018 జనవరి 18: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయ. ఫిబ్రవరి 5వ తేదీ సోమవారం రాత్రి 6.00 నుండి 8.00 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

06-02-2018(మంగళవారం) ధ్వజారోహణం(కుంబలగ్నం) పెద్దశేష వాహనం

07-02-2018(బుధవారం) చిన్నశేష వాహనం హంస వాహనం

08-02-2018(గురువారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
09-02-2018(శుక్రవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

10-02-2018(శనివారం) పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం

11-02-2018(ఆదివారం) హనుమంత వాహనం స్వర్ణరథం,గజ వాహనం

12-02-2018(సోమవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

13-02-2018(మంగళవారం) రథోత్సవం అశ్వవాహనం

14-02-2018(బుధవారం) చక్రస్నానం ధ్వజావరోహణం

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.