TRANSFORM SRIVARI SEVA INTO A PROFESSIONAL UNIT-TIRUMALA JEO_ మార్చి రెండో పక్షంలో సర్వదర్శనం టైంస్లాట్ కౌంటర్లు: టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్. శ్రీనివాసరాజు
Tirumala, 6 February 2018: To enhance the quality of service among Srivari Sevakulu, Tirumala JEO Sri KS Sreenivasa Raju directed the officials concerned to identify the best service-oriented Srivari Sevakulu and transform them into a professional unit.
The weekly review meeting with senior officers of TTD with Tirumala JEO was held at Annamaiah Bhavan in Tirumala on Tuesday. While reviewing the progress of department wise activities, the JEO instructed the PRO and Srivari Seva Head Dr T Ravi to identify the best among Srivari Sevakulu to offer better services to the multitude of visiting pilgrims coming to Tirumala. “See that the strength of Sevakulu should not exceed 2000. We want quality service not quantity. These 2000 sevakulu should offer best possible services to pilgrims”, he added.
The JEO also said, the Slotted Sarva Darshan (SSD) counters will commence both at Tirumala and Tirupati from second fortnight of March. In Tirumala the counters will be set up at RTC Bus Stand, CRO back side(near Koustubham), Nandakam Rest House, Varahaswamy Rest House and Srivari Mettu point. While in Tirupati, 22 counters are coming up at Vishnunivasam, 8 at II and III Chowltries, 10 at Southern side of subway near RTC, 5 at Srinivasam and 10 at Bhudevi Complex Alipiri Link Bus Stand”, he added.
He also directed the engineering officials to modify all sub enquiry offices as allotment counters and rationalize the deployment of attenders towards the smooth run of the rooms allotment.
JEO INSPECTS SSD MODEL COUNTER AT NANDAKAM
After the review meeting, Tirumala JEO Sri KS Sreenivasa Raju inspected the SSD model counter at Nandakam. He has also inspected the compartment no. 26 in VQC 1 to see the arrangement while releasing the compartment to ensure that pilgrims are not put to any sort of inconvenience. Later the JEO also inspected the SSD counters which are going to come up at RTC bus stand.
CE Sri Chandra Sekhar Reddy, FACAO Sri Balaji, SE II Sri Ramachandra Reddy, GM Sri Sesha Reddy, VSO Sri Ravindra Reddy and other officers were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
మార్చి రెండో పక్షంలో సర్వదర్శనం టైంస్లాట్ కౌంటర్లు: టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్. శ్రీనివాసరాజు
ఫిబ్రవరి 06, తిరుమల, 2018: శ్రీవారి దర్శనార్థం సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్ విధానాన్ని మార్చి రెండో పక్షం నుంచి అమలు చేసేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని టిటిడి తిరుమల జెఈవో శ్రీకెఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ఉదయం సీనియర్ అధికారులతో జెఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లడుతూ తిరుమలలో ఆర్టీసీ బస్టాండ్, సిఆర్వో వెనుకవైపు ఉన్న ప్రాంతం, నందకం, శ్రీవారిమెట్టు నుంచి తిరుమలకు చేరుకునే ఎంబీసీ ప్రాంతంలో టైంస్లాట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌తో పాటు ఇతర సీనియర్ అధికారుల సూచనలను పరిగణలోకి తీసుకుని నందకంలో మోడల్ కౌంటర్ ఏర్పాటు చేశామని, ఇదే తరహాలో ఇతర ప్రాంతాలలో కౌంటర్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. అదేవిధంగా తిరుపతిలో విష్ణునివాసం, గోవిందరాజస్వామి 2, 3 సత్రాలు, ఆర్టీసి బస్టాండ్, శ్రీనివాసం వసతి సముదాయం, అలిపిరి లింక్ బస్టాండ్‌లోని భూదేవి కాంప్లెక్స్ ప్రాంతాలలో మొత్తం 55కుపైగా కౌంటర్లను ప్రణాళికాబద్ధంగా భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
త్వరలో పూర్తికానున్న శ్రీవారిసేవా సదన్‌లో సిసిటివీలు, ఫర్నీచర్ తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చినట్లు జెఈవో తెలిపారు. శ్రీవారిసేవకుల సేవలను చక్కగా వినియోగించుకునేందుకు శ్రీవారి ఆలయం, అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని ప్రజాసంబంధాల విభాగం అధికారి డా.టి.రవిని ఆదేశించారు. ఇకపై ఒక రోజుకు 2 వేల మంది వరకు శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకుంటామన్నారు. తిరుమలలోని ఉపవిచారణ కార్యాలయాలను అలాట్‌మెంట్ కౌంటర్లుగా అభివృద్ధి చేసేందుకు అధికారులతో చర్చించినట్లు తెలిపారు. భక్తులకు మరింత ఉన్నతంగా సేవలు అందించేందుకు చర్యలు చేపడతామన్నారు.
అనంతరం నందకంలోని సర్వదర్శనం భక్తుల టైంస్లాట్ మోడల్ కౌంటర్‌ను జెఈవో పరిశీలించారు. కౌంటరులో చేపట్టాల్సిన మార్పులపై ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1ను పరిశీలించారు. ఆర్‌టిసి బస్టాండు లోపల ఏర్పాటుచేయనున్న టైంస్లాట్ కౌంటర్లను జెఈవో పరిశీలించారు.
ఈ సమావేశంలో టిటిడి ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఈ 2 శ్రీ రామచంద్రారెడ్డి, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, డిప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్, శ్రీ బాలాజీ, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.