SRINIVASA MANGAPURAM BRAHMOTASAVAMS OFF TO A COLOURFUL START_ ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Srinivasa Mangapuram, 6 February 2018: The annual Navahnika brahmotsavams in the famous temple of Sri Kalyana Venkateswara Swamy at Srinivasa Mangapuram, about 15km from Tirupati off to a ceremonial start on Tuesday with the traditional Dhwajarohanam which took place in the auspicious Kumbha Lagnam.

Speaking on this occasion, TTD EO Sri Anil Kumar Singhal said, the temple has a marvelous historical background and was brought under the control of TTD in the year 1967. The annual brahmotsavams of this famous temple are being observed on par with Tirumala every year.

TTD has made elaborate arrangements for this grand religious fete as tens of thousands of devotees from Tirupati, Srinivasa Mangapuram and other surrounding villages take part in the Vahana sevas during the mega religious festival”, he added.

FLORAL DECORATIONS STAND AS SPECIAL ATTRACTION

Meanwhile the floral decorations with the concept of Adiparasakti Devi with Trinity including Lord Brahma – the creator, Lord Maha Vishnu-the Protector and Lord Siva-the Destroyer offering prayers to the Mother Goddess with varieties of flowers remained special attraction during the annual brahmotsavams.

Tirumala JEO Sri KS Sreenivasa Raju who is also the present in-charge Tirupati JEO, Additional CVSO Sri Sivakumar ReddyDyEO Sri Venkataiah and other temple staff were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2018 ఫిబ్రవరి 06: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం 8.15 నుండి 8.45 గంటల మధ్య కుంభలగ్నంలో జరిగిన ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రం శాస్త్రోక్తంగా జరిగింది.

అంతకుముందు ఉదయం 7.00 నుండి 8.00 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. కుంభ లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్ఠిస్తారు. ఎన్ని దానాలు చేసినా ధ్వజారోహణకార్యంలో గరుడారోహణం చేసిన పుణ్యంతో సాటిరాదని పురాణాలు చెబుతున్నాయి. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుంది.

బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడుతూ పురాతనమైన కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం భారత పురాతత్వశాఖ ఆధీనంలో ఉందని, 1980వ సంవత్సరం నుంచి అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఆలయానికి భక్తుల రాక పెరుగుతోందని, ఈ క్రమంలో ఈ మేరకు వసతులు పెంచుతున్నామని వెల్లడించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 10న గరుడసేవ, ఫిబ్రవరి 11న స్వర్ణరథోత్సవం, ఫిబ్రవరి 13న రథోత్సవం, ఫిబ్రవరి 14న చక్రస్నానం జరుగనున్నట్టు వివరించారు. ప్రతిరోజూ ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, తిరిగి రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను రద్దు చేసినట్లు తెలిపారు.

బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ, ఆకర్షణీయంగా పుష్పాలంకరణలు, లైటింగ్‌తో కటౌట్లు ఏర్పాటుచేశామన్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో స్వామివారి ఆలయంలో ధార్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. వాహనసేవల్లో వివిధ జిల్లాల నుండి కళాబృందాలు ప్రదర్శనలివ్వనున్నట్టు వెల్లడించారు. భక్తులు పెద్ద
సంఖ్యలో విచ్చేసి స్వామివారి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి ఇన్‌చార్జ్‌ జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, అదనపు సివి అండ్‌ ఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య, విజివో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఏఈవో శ్రీ
శ్రీనివాసులు, ప్రధాన కంకణబట్టార్‌ శ్రీ బాలాజీ రంగాచార్యులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.