TRIAL- RUN OF GARUDA SEVA ON SEPTEMBER 14_ సెప్టెంబ‌రు 14న తిరుమ‌ల‌లో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ

Tirumala, 13 Sep. 19: The Pournami Garuda Seva will be observed in Tirumala on Saturday.

However, this Garuda Seva will be treated as a trial for the big one which will be observed on October 4 during the ensuing annual brahmotsavams.

The entry and exit points in galleries, security arrangements, other issues with respect to Garuda Seva will be inspected, observed and monitored by the officials and various department HoDs on September 14 during the procession of Garuda Vahanam.

Sri Malayappa Swamy will take a ride on Garuda Vahanam in the four Mada streets between 7 pm and 9 pm.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌రు 14న తిరుమ‌ల‌లో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ

తిరుమల, 2019 సెప్టెంబ‌రు 13: తిరుమలలో సెప్టెంబ‌రు 14వ తేదీ పౌర్ణమిరోజున‌ మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్బంగా శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గ‌రుడ‌వాహ‌నంపై శ‌నివారం రాత్రి 7 గం||ల నుండి 9 గం||ల నడుమ భక్తులను అనుగ్రహించనున్నారు.

సెప్టెంబరు 30 నుండి అక్టోబ‌ర్ 8వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాదీ ముందుగానే బ్రహ్మోత్సవాల తరహాలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా టిటిడి ఉన్నతాధికారులు ఆలయ నాలుగు మాడవీధుల్లో భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాల‌ను, ఇతర ఇంజినీరింగ్‌ ఏర్పాట్లను పరిశీలించ‌నున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.