TRIDOSHA SIDDHANTA ROOT OF AYURVEDA- DR POLISHETTY RAVISHANKAR _ ఆయుర్వేదానికి మూలం త్రిదోష సిద్ధాంతం : డాక్టర్ పోలిశెట్టి రవిశంకర్

Tirupati, 30 April 2022: Renowned heart surgeon Dr Polishetty Ravi Shankar said on Saturday that Tridosha Siddhanta is the root and basis of entire Ayurveda medicine.

 

Dr Ravi Shankar, popular for his research papers on Ayurveda in international medical journals was at SV Ayurveda College.

 

Addressing students on the theme ’How and Why Should Ayurveda medicine turn into mainstream medicine’ – an allopathic doctors perception’. He was hopeful that SV Ayurveda College and other institutions would promote research in future.

 

Dr Murali Krishna, Principal of SV Ayurveda College also spoke on prospects of research in Ayurveda medicine and students participation.

 

Dr. Renu Dixit, Dr Ramasubba Reddy and students were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

 

ఆయుర్వేదానికి మూలం త్రిదోష సిద్ధాంతం : డాక్టర్ పోలిశెట్టి రవిశంకర్
 
తిరుపతి, 2022 ఏప్రిల్ 30: ఆయుర్వేద వైద్యశాస్త్రానికి మూలం త్రిదోష సిద్ధాంతమని, దానిని సమగ్రంగా ఆకళింపు చేసుకోవడం వల్ల వ్యాధి కారణాలు, చికిత్సా పద్ధతులను సులువుగా విశ్లేషించి సంపూర్ణంగా వ్యాధిని నయం చేయవచ్చని ప్రముఖ గుండె శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పోలిశెట్టి రవిశంకర్ అన్నారు. ఈయన అల్లోపతి వైద్యులు అయినప్పటికీ ఆయుర్వేదం పైన విపరీతమైన అభిమానంతో గురుముఖంగా ఆయుర్వేద వైద్య శాస్త్రాన్ని అభ్యసించారు. త్రిదోష సిద్ధాంతం పై పరిశోధన చేసి పలు అంతర్జాతీయ జర్నళ్లలో 100కు పైగా పరిశోధన పత్రాలను ప్రచురించారు. ఆయుర్వేద కళాశాల ఆహ్వానం మేరకు శనివారం విచ్చేసి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.
 
ఈ సందర్భంగా డాక్టర్ రవి శంకర్ మాట్లాడుతూ “హౌ అండ్ వై షుడ్ ఆయుర్వేద మెడిసిన్ టర్న్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్ – యాన్ అల్లోపతి డాక్టర్ పర్సెప్షన్” అనే అంశంపై ఆయన ప్రసంగించారు. అల్లోపతి వైద్య విధానంలో కొన్ని రకాల చికిత్సలు సఫలం కాకపోవడానికి గల కారణాలను త్రిదోష సూత్రాల ద్వారా విశదీకరించారు. ఆయుర్వేద మౌలిక సిద్ధాంతాలపై పలు అంతర్జాతీయ పరిశోధన సంస్థల ద్వారా చేస్తున్న పరిశోధనల వివరాలను విద్యార్థులకు తెలియజేశారు. ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రికి  అనుబంధంగా భవిష్యత్తులో కొన్ని పరిశోధనలు చేయాలని ఉత్సాహంగా ఉందని తెలిపారు.
 
ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ అలాంటి పరిశోధనల్లో పాలుపంచుకోవడానికి అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా ఉన్నారని తెలియజేశారు.
 
ఈ కార్యక్రమంలో డాక్టర్ రేణు దీక్షిత్, డాక్టర్ రామసుబ్బారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.