WOMEN’S HEALTH AWARENESS CLASS HELD _ మహిళల ఆరోగ్యంపై శ్వేతలో అవగాహన

TIRUPATI, 30 APRIL 2022: As a part of awareness on women’s health, a class with expert doctors was held to TTD women employees at the SVETA building in Tirupati on Saturday.

Renowned Doctors including Dr Alladi Mohan, Amara Hospital MD Dr G Ramadevi, Ruia Superintendent Dr Bharati, SVIMS Oncologist Dr Bhargavi, SV Ayurvedic College Asst. Prof. Dr Swarnalata, Nutritionist Smt P Deepti took different sessions for women employees.

SVETA Director Smt Prasanti was also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

మహిళల ఆరోగ్యంపై శ్వేతలో అవగాహన
 
తిరుపతి, 2022 ఏప్రిల్ 30: మహిళలు ఎదుర్కొనే పలురకాల ఆరోగ్య సమస్యలపై శనివారం శ్వేత భవనంలో టి‌టి‌డి మహిళా ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ప్రముఖ జనరల్ ఫిజిషియన్, స్విమ్స్ డీన్ డా || అల్లాడి మోహన్ పాల్గొని మహిళలు ఎదుర్కొనే అనేక సాధారణ సమస్యల పై అవగాహన కల్పించారు. మహిళలు ఎక్కువగా ఇబ్బందిపడే నెలసరి సమస్యలు, మెనోపాజ్ వంటి సమస్యలను ముందుగా గుర్తించి చికిత్స చేయించుకోవడం మంచిదన్నారు. మహిళా ఆరోగ్యం కుటుంబానికే ఆరోగ్యమని, కావున మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
 
రుయా సూపరింటెండెంట్ డా || టి. భారతి మాట్లాడుతూ గర్భిణులు పోషకాహారం తీసుకుని ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్నారు. ఇంట్లో, ఉద్యోగంలో కలిగే ఒత్తిడి వలన అనేక అనారోగ్యాలకు మహిళలు గురికావలసి వస్తోందని చెప్పారు.
 
స్విమ్స్ అంకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా || డి. భార్గవి మాట్లాడుతూ నేటి కాలంలో మహిళలు వివిధ కాన్సర్ల  బారిన పడుతున్నారన్నారు. వీటిలో గర్భాశయ కాన్సర్, రొమ్ము కాన్సర్ వంటివి చాలా ప్రధానమైనవని అన్నారు. వీటికి అనేక చికిత్స మార్గాలు ఉన్నాయని, కావున వీటి గురించి ఎవరూ భయపడవద్దని చెప్పారు.
 
ఎస్‌వి ఆయుర్వేద కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెస్సర్ డా || స్వర్ణలత మాట్లాడుతూ ఆన్ని సమస్యలకు ఆయుర్వేదం ఉత్తమ మార్గం అన్నారు. సమస్యలను ఆయుర్వేదం ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా నివారిస్తుందన్నారు. 
 
అమర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ న్యూరాలజిస్ట్ డా || జి. రమాదేవి మాట్లాడుతూ మహిళా ఆరోగ్యంలో నిద్ర కూడా గొప్ప ఔషధంగా పనిచేస్తుందని అన్నారు. నేటి ఆధునిక కాలంలో నిద్ర లేమి వలన అనేక శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు మహిళలను బాధిస్తున్నాయని అన్నారు. నరాల బలహీనత, తల నొప్పి, మైగ్రేన్ వంటి వాటికి నిద్ర ఒక చికిత్స అన్నారు. 
 
ప్రముఖ న్యూట్రిషినిస్ట్  పి.దీప్తి మాట్లాడుతూ నేడు మన దేశంలో ఎక్కువ శాతం మహిళలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారన్నారు. మహిళల్లో కలిగే అనేక వ్యాధుల నివారణలో పోషకాహారం ప్రధానమైనదని అన్నారు. ఏయే ఆహార పదార్థాలలో ఎలాంటి పోషకాహార విలువలు ఉన్నాయో వివరించారు.
 
శ్వేత సంచాలకులు శ్రీమతి ఎ.ప్రశాంతి మాట్లాడుతూ శ్వేత శిక్షణ సంస్థ ఉద్యోగులకు కార్యనిర్వహణ అవగాహన తరగతులతో పాటు, వివిధ విభాగాలపై అవగాహన తరగతులు, ఆధ్యాత్మిక, తిరుమల చారిత్రక అవగాహన కార్యకారమాలు నిర్వహిస్తోందన్నారు. వీటితో పాటు ఉద్యోగుల ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పించేందుకు మహిళలకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. 
 
ఈ కార్యక్రమంలో టి‌టి‌డి మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.