TRIO BLESSES DEVOTEES ON SIMHA _ సింహ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల అభయం

VONTIMITTA, 02 APRIL 2023:  As part of the ongoing annual brahmotsavam at Vontimitta, on the third day evening, Sri Sita Lakshmana sameta Sri Rama blessed His devotees on Simha Vahanam.

Devotees offered Harati to the Trio with utmost devotion all through the procession.

Deputy EO Sri Natesh Babu, Special Officer Smt Vijayalakshmi, AEO Sri Gopal Rao and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సింహ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల అభయం
 
ఒంటిమిట్ట, 2023 ఏప్రిల్ 02: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం రాత్రి శ్రీ సీతారామలక్ష్మణులు సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
 
శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగశాస్త్రంలో సింహం బలానికి(వహనశక్తి), వేగానికి(శీఘ్రగమన శక్తి) ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని వాహనసేవలో అంతరార్థం.
 
 ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ నటేష్ బాబు, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్, ఏఈఓ శ్రీ గోపాలరావు, సూపరింటెండెంట్లు శ్రీ పి.వెంకటేశయ్య, శ్రీ ఆర్సీ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయ తదితరులు పాల్గొన్నారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.