TRUE WEALTH IS BHAGAVANNAMA SMARANA- UDIPI SEER _ పురందరదాస కీర్తనలతో మారుమోగిన నారాయణగిరి ఉద్యానవనాలు

TTD IS DEVOTIONAL CAPITAL OF INDIA

Tirumala, 11 Feb. 21: Terming Tirumala Tirupati Devasthanams as the devotional capital of India, Udipi Puttige Mutt Pontiff Sri Sugunendra Theertha Swamy said Lord in Gita advocated that wherever there is Bhakti, I will be there. 

During his religious discourse on the occasion of 174th Aradhana Mahotsavam of Kannada Pitamaha Sri Purandhara Dasa the Seer preached that true wealth is Bhagavannama Smarana in Kaliyuga.

He later complimented TTD manadrins for their impeccable dedication in taking forward Sanatana Hindu Dharma Prachara in a big way through various projects and lauded Dasa Sahitya Project in particular.

Later he felicitated and blessed TTD EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, and CVSO Sri Gopinath Jatti.

Earlier the melodious rendition of Purandhara Dasa Sankeertans by the artistes provided a soothing devotional feel to the devotees who converged to witness the Unjal Seva of the processional deities on the occasion.

The Project Special Officer Sri P Anandatheerthacharya, temple DyEO Sri Harindranath and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పురందరదాస కీర్తనలతో మారుమోగిన నారాయణగిరి ఉద్యానవనాలు

తిరుమల, 2021 ఫిబ్ర‌వ‌రి 11: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు శుక్ర‌వారం సాయంత్రం శ్రీ పురందరదాసులవారి కీర్తనలతో మారుమోగాయి. శ్రీ పురందరదాసులవారి ఆరాధన మహోత్సవాలు గురువారం రెండో రోజుకు చేరుకున్నాయి. ముందుగా శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేశారు. ఈ సంద‌ర్భంగా చల్లటి సాయంత్రం వేళ నిర్వ‌హించిన ఊంజ‌ల్‌సేవ‌లో దాస సంకీర్తనల గానం భక్తులను మైమరపింపచేసింది.

టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురందరదాస కృతులను ఆలపించారు. ఇందులో గురుపురందర దాసరే…., లక్ష్మి బారో…, నంద నందన బారో…, నారాయణ గోవింద జయ జయ…., హరినారాయణ…. చివరిగా నరసింహ స్వామి వారి కీర్తనలు భక్తి సాగరంలో ముంచెత్తాయి.

అనంతరం ఉడిపికి చెందిన పుత్తిగే మఠాధిపతి శ్రీ‌శ్రీ‌శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ మంగళాశాసనాలు అందిస్తూ పురందరదాస కీర్తనలు భక్తిని విశేషంగా వ్యాప్తి చేస్తున్నాయని తెలిపారు. భగవంతుని నామసంకీర్తన కలియుగంలో అత్యంత ఉత్క ష్టమైన భక్తి మార్గమని చాటి చెప్పారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారి తత్త్వన్ని, వైభవాన్ని, వేంకటాచల మహత్యాన్ని స్వామిజీలు భక్తులకు విశదీకరించారు.

తరువాత టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఏ.వి. ధర్మారెడ్డి, సి వి ఎస్ వో శ్రీ గోపీనాథ్ జెట్టిని సన్మానించి స్వామివారు ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో దాససాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ పి ఆర్ ఆనంద తీర్థచార్యులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు, భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.